ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి జీవితానికి సంబంధించిన అంచనాలను కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా, వ్యక్తి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలిగే AI ఆధారిత టూల్ ఒకటి రాబోతోంది. దీనికి AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ AIRE అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ గుండె వైఫల్యం ఆధారంగా వ్యక్తి చావు సమయాన్ని అంచనా వేస్తుంది.
ఈ AIRE వ్యవస్థ గుండె పనితీరును విశ్లేషించి, గుండె ఎప్పుడు రక్త ప్రసరణను నిలిపివేస్తుందన్న విషయాన్ని గుర్తించగలుగుతుంది. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఆధ్వర్యంలో రెండు ప్రధాన ఆసుపత్రుల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. వేలాది మంది ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు, వారి ECG డేటా ఆధారంగా గుండె ఆరోగ్యం గురించి AI విశ్లేషణలు అందిస్తుంది.
AI డెత్ కాలిక్యులేటర్ ప్రాధాన్యత ఏమిటంటే, వైద్యులు కూడా సులభంగా గుర్తించలేని గుండె సమస్యలను గుర్తించగలగడం. AI ఆధారంగా గుండె వైఫల్యాన్ని ముందుగానే అంచనా వేసి, రోగికి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ టూల్ ఇప్పుడు మొదటి ట్రయల్స్‌లో 78 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకు ముందు సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలు మనిషి ఆరోగ్య స్థితిని చెప్పేవి. కానీ AI ఆధారిత ఈ కొత్త టెక్నాలజీ గుండె పనితీరును డీప్ లెవెల్‌లో విశ్లేషించి, సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న అంశాన్ని చెబుతుందన్నమాట.
అందుకే, ఈ టెక్నాలజీ వైద్య రంగంలో అనేక కొత్త అవకాశాలను తెర మీదకు తీసుకొస్తోంది. AIRE టూల్ రూపకల్పన కోసం మిలియన్ల ECG రిపోర్టులను సేకరించి, వాటి ఆధారంగా AI విశ్లేషణలను రూపొందించారు. 11.60 లక్షల మంది రోగుల ECG డేటాను విశ్లేషించి, వారి గుండె పనితీరును అంచనా వేసి, అకాల మరణాల గురించి సమాచారాన్ని అందించారు. ప్రజలు ఈ టెక్నాలజీ పట్ల ఆసక్తిని చూపుతున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ AI డెత్ కాలిక్యులేటర్‌పై అనేక మంది ఆసక్తి చూపిస్తుండటంతో, దీనిని మరింత విస్తరించి వినియోగంలోకి తీసుకురావాలని పరిశోధకులు భావిస్తున్నారు.
This post was last modified on November 4, 2024 11:27 am
ఒకప్పుడు క్లాసిక్ ఫిలిం మేకర్ గా రాంగోపాల్ వర్మ అంటే ప్రేక్షకులకు విపరీతమైన గౌరవం, అభిమానం ఉండేవి కానీ గత…
సరిగ్గా పదేళ్ల క్రితం నాటి మాట. 2014 సంవత్సరం. జూనియర్ ఎన్టీఆర్ వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. మార్కెట్ తగ్గలేదు కానీ…
మంచు విష్ణు కన్నప్ప ఏప్రిల్ 25 విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకో డెబ్భై రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం…
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ కో…
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ…
వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా…