ఇండస్ట్రీకి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఎట్టకేలకు మీనాక్షి చౌదరి బోణీ కొట్టేసింది. నిన్నటి దాకా సరైన సక్సెస్ లేక అవకాశాలు వస్తున్నా ఆనందం కరువైన హర్యానా బ్యూటీకి లక్కీ భాస్కర్ రూపంలో లక్కు కలిసి వచ్చింది. రిలీజైన మొదటి రోజే యునానిమస్ పాజిటివ్ టాక్, రివ్యూలతో దూసుకుపోయిన ఈ రెట్రో మనీ థ్రిల్లర్ లో దుల్కర్ సల్మాన్ దే వన్ మ్యాన్ షో అయినప్పటికీ ప్రాధాన్యత పరంగా మీనాక్షి చౌదరికీ మంచి ఎపిసోడ్లు పడ్డాయి. బిడ్డ తల్లిగా నటించాల్సి వచ్చినా పెర్ఫార్మన్స్ చూపించుకోవడానికే దర్శకుడు వెంకీ అట్లూరి తగినంత స్కోప్ ఇవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువయ్యింది.
గుంటూరు కారం, ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో చేసినప్పుడు మహేష్ బాబు, విజయ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం దక్కిందని తొలుత సంబరపడినా ఆ ఆనందం వాటి ఫలితాల రూపంలో దక్కకపోవడమే కాక పాత్రలను డిజైన్ చేసిన తీరు నిరాశ కలిగించింది. అందుకే ఇప్పుడు లక్కీ భాస్కర్ తనకు కీలక మలుపు కానుంది. ఇంకో పది రోజుల గ్యాప్ లో వరుణ్ తేజ్ మట్కా రాబోతోంది. అందులో కూడా హీరో భార్యగానే చేయడం గమనార్హం. కాకపోతే క్యారెక్టర్ కి ఏమైనా షాకింగ్ ముగింపు ఇస్తారా లేక వరుణ్ తో సమానంగా వయసు మళ్లే దాకా షేడ్స్ ఉంటాయా చూడాలి.
ఇదే నెలాఖరు విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ వస్తుంది. పోలిక ప్రకారం చూసుకుంటే మిగిలిన సినిమాల కన్నా ఇందులో గ్లామర్ టచ్ ఉండేలా కనిపిస్తోంది. శ్రద్ధ శ్రీనాథ్ ఉన్నప్పటికి లీడ్ రోల్ మీనాక్షిదే. ఇది కూడా బ్రేక్ ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది. ఈ రెండు సక్సెస్ అయితే ఆఫర్లు తిరిగి పుంజుకుంటాయి. విశ్వంభరలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారానికి మీనాక్షి చౌదరి ఇటీవలే స్వయంగా చెక్ పెట్టింది. అదంతా అబద్దమని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కేవలం వారాల వ్యవధిలో ఇన్ని కొత్త రిలీజులు ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకటే. మరి ఈ లక్కుని కొనసాగిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on November 3, 2024 4:39 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…