ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ మార్కెట్ లో అతని మాట కూడా ఒక శాసనం. మార్కెట్ ను ప్రభావం చేసే అతికొద్ది మంది వ్యక్తులలో ఈయన ఒకరు. ఇక బఫెట్ స్థాపించిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ ప్రస్తుతం 325 బిలియన్ డాలర్లకు పైగా నగదును తన ఖాతాలో నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది బెర్క్‌షైర్ తన భారీ పెట్టుబడులను క్రమంగా విక్రయించడం వల్ల ఈ మొత్తం నగదు జమ అయింది. ముఖ్యంగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా మరింత నగదు సమకూరింది. యాపిల్ సంస్థలో గత సంవత్సరం చివరిలో 174.3 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను బఫెట్ బెర్క్‌షైర్ హాథవే సొంతం చేసుకుంది.
అయితే ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ షేర్లను భారీగా విక్రయించడంతో, ఈ మొత్తం 69.9 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఈ షేర్ల విక్రయంతో భారీ మొత్తం నగదు రూపంలో నిలిచింది. ఇంకా, బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనూ బెర్క్‌షైర్ కొన్ని వాటాలను విక్రయిస్తూ నగదు నిల్వను పెంచుకుంది.
మొత్తం ఆస్తులను నగదు రూపంలో నిల్వ ఉంచడం ద్వారా, భవిష్యత్తులో మరింత లాభదాయకమైన పెట్టుబడుల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బెర్క్‌షైర్ హాథవే యొక్క ఆదాయం అనుకున్నంత భారీగా మారలేదు. గత ఏడాది 93.21 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసిన ఈ సంస్థ, ఈ ఏడాది 92.995 బిలియన్ డాలర్లను ప్రకటించింది. దీంతో బెర్క్‌షైర్ యొక్క ఆదాయ మార్గాలు స్థిరంగా ఉన్నా, సంస్థలోని కీలక పెట్టుబడుల విక్రయం ద్వారా నిల్వలు పెరుగుతున్నాయి.
This post was last modified on November 3, 2024 4:22 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…