ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లు. అంటే అద్బుతమైన భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతుంది. 40 ఏళ్ల భవిష్య జీవితాన్ని తనకు అనుకూలమైన రీతిలో సుఖంగా జీవించేందుకు మెట్లు ఏర్పాటు చేసుకునే వయసు అది! కానీ, ఆ పిల్ల దారి తప్పేసింది. సిగరెట్లతో ప్రారంభమైన ఆ అమ్మాయి.. అలవాట్లు గంజా యి వరకు.. అక్కడ నుంచి నిషేధిత డ్రగ్స్ వరకు చేరింది. అన్నం లేకపోయినా.. ఉంటుంది కానీ.. డ్రగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరింది.
మరి ఈ డ్రగ్స్ ఎక్కడనుంచి వస్తున్నాయి? అంటే.. తెలిసిన యువకుల ద్వారా సేకరించింది. దీనికి ఆ అమ్మాయి.. పెట్టిన ఖర్చు.. ‘సెక్స్’!! ఆశ్చర్యంగా అనిపించినా నిజం. అనైతిక దారిలో నడవడమే కాకుండా.. డ్రగ్స్ కోసం.. ఎవరితోబడితే వారితో సెక్స్‌లో పాల్గొని వారిని మురిపించింది. ఫలితంగా తాను ప్రమాదంలో చిక్కుకుని ఏకంగా 19 మంది యువకుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.
ఎక్కడ జరిగింది?
దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన కాలేజీ విద్యార్థి ఒకరు.. 16వ ఏటే.. సిగరెట్లకు అలవాటు పడింది. దీనిని ఆమె స్టయిల్‌గా భావించింది. యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్రభావం కూడా పడింది. ఆ తర్వాత..పరిచయాలతో పాటు.. అలవాట్లు కూడా పెరిగి.. గంజాయికి దారి తీసింది. అనంతరం.. డ్రగ్స్ వైపు మళ్లింది. ఇక, అక్కడి నుంచి ఆమె అనైతిక సెక్స్ వ్యవహారాలకు కూడా జీవితాన్ని నాశనం చేసుకుంది.
నైనిటాల్‌లో ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు.. ఈ అమ్మాయితో సెక్స్ చేసిన ఓ యువకుడు అనారోగ్యంతో వచ్చాడు. అతనిని పరీక్షించగా.. ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయన విధుల్లో భాగంగా సర్కారుకు రహస్య సమాచారం చేరవేశారు. దీంతో నైనిటాల్ వ్యాప్తంగా అన్ని కాలేజీల్లోనూ యువతకు ఎయిడ్స్ పరీక్షలు నిర్వహింగా.. అమ్మాయి చదువుతున్న కాలేజీలో 19 మంది యువకులకు ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్యం అందిస్తున్నారు.
This post was last modified on November 2, 2024 6:08 am
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…