వినియోగదారులు ఎంతో ఇష్టంగా తినే ‘మయోనైజ్’ క్రీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. దీనిని వినియోగిస్తే.. రూ.5 నుంచి 10 లక్షల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇతర ఆహార తయారీ, విక్రయ కేంద్రాలకు జరిమానా విధిస్తామని తెలిపింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా మయోనైజ్ వినియోగంపై వైద్యులు, పర్యావరణ వేత్తలు, ఆరోగ్య నిపుణులు కూడా.. సర్కారుకుకొన్ని సూచనలు చేశారు. దీనిని వినియోగించడంపై నిషేధం విధించాలని వారు కోరారు. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం తాజాగా మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏంటీ మయోనైజ్?
వీకెండ్స్ సహా.. ఇతర కార్యక్రమాల్లోనూ విరివిగా ఆరగిస్తున్న పదార్థాల్లో బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు, డిప్స్, సలాడ్స్ ఉంటున్నా యి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా.. మరింతగా తినాలని కూడా అనిపిస్తుంది. దీనికి కారణం.. ఈ పదార్థాలలో ప్రత్యేకంగా వినియోగించే “మయోనైజ్”చాలా చాలా టేస్టీగా, జ్యూసీగా ఉండే మయోనైజ్‌ను బిర్యానీలు, చికెన్ రోల్స్ సహా స్నాక్స్‌లోనూ వినియోగిస్తున్నారు. ఈ మయోనైజ్ అనే క్రీమ్‌ను కోడి గుడ్డు నుంచే తయారుచేస్తారు. అయితే.. కోడిగుడ్డులోని సొనలో ఉండే సాల్మొనెల్లాను అధికంగా వినియోగించడం ద్వారా.. మయోనైజ్ టేస్ట్ పెరుగుతోంది. పైగా గంటల తరబడి నిల్వ కూడా ఉంచుతున్నారు. ఇది ప్రాణాంతకమన్నది వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట.
ఏం జరుగుతుంది?
మయోనైజ్ క్రీమ్‌ను ఎక్కువగా తీసుకోవడం కాదు.. అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… కార్డియో(గుండె సంబంధిత), కీళ్ల సంబంధిత, నరాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలో తయారుచేసే మయోనైజ్ ను అస్సలు వినియోగించరాదని కూడా చెబుతున్నారు. ఎందుకంటేనాణ్యత లేని కోడిగుడ్లను కూడా దీనికి వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మయోనైజ్‌ను నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది.
This post was last modified on %s = human-readable time difference 10:15 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన సలహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు…
కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక…
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు…
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా భేటీ అయ్యారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల పైనే…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం…
ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో…