మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనే విషయం చాన్నాళ్ల ముందే వెల్లడైంది. తెలుగులో హార్రర్ కామెడీలు ఊపందుకోవడంలో మారుతిదే ప్రధాన పాత్ర. అతను తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది.
దీంతో వరుసగా ఆ జానర్లో సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ల తర్వాత ఆ జానర్ జనాలకు మొహం మొత్తేసింది. దీంతో ఆ తరహా సినిమాలు ఆగిపోయాయి. కానీ తనే పక్కన పెట్టేసిన జానర్‌లో మళ్లీ ఇప్పుడు ‘రాజా సాబ్’ తీస్తున్నాడు మారుతి. హార్రర్ కామెడీ జానర్లో ఎక్కువగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే వచ్చాయి.
ఐతే ప్రభాస్ లాంటి టవరింగ్ స్టార్‌తో మారుతి ఈ జానర్లో ఈ దశలో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూశాక ప్రభాస్ పాత్ర, కథ విషయంలో జనాలకు ఒక అంచనా వచ్చేసింది.
ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన యంగ్ క్యారెక్టర్ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
‘చంద్రముఖి’లో డాక్టర్, రాజు పాత్రల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా చెలరేగిపోయారో తెలిసిందే. ఆ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ఈ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి కొనసాగింపుగా తీసిన ‘నాగవల్లి’లో విక్టరీ వెంకటేష్ సైతం ఇలాగే డాక్టర్, రాజు పాత్రల్లో కనిపించాడు.
కానీ ఆయనకు రాజు పాత్ర అస్సలు సూట్ కాలేదు. సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ రజినీలా మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా.. లేక వెంకీలా డిజప్పాయింట్ చేసి ఫెయిల్యూర్‌ను ఖాతాలో వేసుకుంటాడా అన్నది చూడాలి.
This post was last modified on October 24, 2024 6:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…