Trends

కొత్త సినిమా ఫెయిల్యూర్ మీట్

కొత్త సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. సక్సెస్ మీట్లు పెట్టేయడం మామూలే. ఐతే ఇప్పుడో చిన్న సినిమాకు చిత్రంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు. తమ సినిమా ఫెయిలైందని మీట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు నిజంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు.

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ శుక్రవారమే ఈ మూవీ ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో టీం ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టింది. ఇలాంటి పేరుతో మీట్ పెట్టడం వెనుక కారణాలేంటో టీం వివరించింది.

తాము మంచి సినిమా చేశామని.. చూసిన వాళ్లందరూ ఇది మంచి సినిమా అంటున్నారని.. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో తాము ఫెయిలయ్యామని అందుకే ఈ ఫెయిల్యూర్ మీట్ పెట్టామని టీం వెల్లడించింది.

ఈ రోజుల్లో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకునేలా చేయడం అంత తేలిక కాదు. ప్రమోషన్లలో ఏదో ఒక వెరైటీ చూపించాల్సిందే. ఈ నేపథ్యంలో ‘లవ్ రెడ్డి’ టీం ఫెయిల్యూర్ మీట్ పేరుతో డిఫరెంటుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మరి ఈ ప్రమోషన్ సినిమాకు ఏమేర కలిసి వస్తుందో చూడాలి.

అందరూ కొత్త వాళ్లు చేసిన ఈ సినిమాకు పర్వాలేదనే టాక్ వస్తోంది. ఇదొక రొటీన్ లవ్ స్టోరీయే అయినా.. హానెస్ట్ అటెంప్ట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. చివరి అరగంట.. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో అందరూ పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు.

లీడ్ పెయిర్ పెర్ఫామెన్స్‌, మ్యూజిక్ గురించి కూడా పాజిటివ్‌గా చెబుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన శ్రావణి రెడ్డి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఫ్రెండు కావడంతో ఆమె కోసం అతను మూడు షోలను స్పాన్సర్ చేశాడు కూడా.

This post was last modified on October 20, 2024 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

51 seconds ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

39 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago