Trends

70 బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం

ఇటీవల దేశీయ విమానయాన రంగంలో బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. గడచిన వారం పది రోజుల్లోనే 70కి పైగా బెదిరింపులు నమోదయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ బెదిరింపులు ప్రధానంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అందివ్వబడుతున్నాయి.

అయితే, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడం విశేషం. అయినా సరే, ప్రొటోకాల్ ప్రకారం విమానయాన సంస్థలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విమానం గాల్లో ఉన్నప్పుడు బెదిరింపు వస్తే, వెంటనే సమీప విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం, అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించడమనే ప్రక్రియలు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

ఇతర విమానాల షెడ్యూల్‌ని చెక్ చేసి ఏటీసీ అనుమతి పొందడం, విమానం మళ్లీ ఎగరాలంటే సమయం పట్టడం వంటివి ఈ ప్రక్రియలో ఒక భాగం. ఈ కారణంగా ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో వేచి ఉండాల్సి రావడంతో విమానయాన సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణికులకు అవసరమైన హోటల్ వసతి, భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను అందించాల్సిన బాధ్యత కూడా విమానయాన సంస్థలకే ఉంటుంది.

ఈ ఏర్పాట్లు చేయడంలో అయ్యే ఖర్చు, ఒకవేళ విమానాన్ని దారిమళ్లిస్తే వచ్చే అదనపు ఇంధన ఖర్చులు ఇలా కలిపితే ఒకసారి బెదిరింపులు వచ్చిన ప్రతీసారీ కనీసం రూ. 3 కోట్ల వరకు ఖర్చవుతోందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. అంతే కాకుండా, ఈ పరిస్థితే లీగల్ సమస్యలకు కూడా దారితీస్తోంది. అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్‌ బుక్ చేసుకున్న ప్రయాణికులు, ఒకవేళ తమ విమానం ఆలస్యం అవ్వడం వల్ల తర్వాతి విమానాన్ని మిస్ అయితే, కోర్టులో కేసులు వేయడం సర్వసాధారణం. మరి ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం వెతుకుతారో చూడాలి.

This post was last modified on October 20, 2024 12:50 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

7 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

37 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago