ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసాట్’తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ సాంకేతికతతో సిమ్‌కార్డు అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.
డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ కార్లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఈ సాంకేతికత పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి క్వాలిటీ సేవలను అందించవచ్చు. డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీతో నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావచ్చు. అంటే ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.. నెట్‌వర్క్ లేకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్టివిటీని ఇస్తుందన్నమాట.
మారుమూల గ్రామాల వారికి, కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సాధారణంగా కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మొబైల్ టవర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త డీటుడీ టెక్నాలజీతో ఇక టవర్ల అవసరం ఉండదు. సిమ్‌కార్డ్ లేకున్నా కూడా శాటిలైట్ ద్వారా నేరుగా కనెక్ట్ అయ్యి సేవలు పొందవచ్చు. ఇంతకు ముందు వాడుతున్న టెక్నాలజీల కన్నా ఇది విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది.
ఈ టెక్నాలజీపై ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. దాదాపు 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ ద్వారా కాల్ చేయడం, కనెక్టివిటీ పొందడం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది అత్యంత నమ్మకమైన టెక్నాలజీ అని, గ్రామీణ ప్రాంతాలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే యూజర్లకు ఇది మరింత సౌకర్యంగా ఉండబోతుందని అభిప్రాయపడింది. త్వరలోనే ఈ డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
This post was last modified on October 18, 2024 3:16 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…