గత 36 ఏళ్ళకు న్యూజిలాండ్ భారత్ గడ్డపై ఒక్క టెస్ట్ సీరీస్ లో కూడా విజయం సాధించలేదు. ఇక బుధవారం బెంగుళూరు చిన్నస్వామీ స్టేడియంలో మొదలైన టెస్టులో భారత్ కు తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా న్యూజిలాండ్ బౌలర్లు భారత్ బ్యాటింగ్ లైనప్ ను ఒక్కసారిగా కూల్చేశారు. తొలిఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోర్.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (13) కొన్ని ఓవర్ల పాటు వికెట్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. అయితే, సౌథీ ఇన్‌స్వింగర్ బంతితో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి, భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్ ఖాన్ (0) లు కూడా ఆ కివీస్ బౌలర్ల ముందు తలవంచారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు, అత్యధిక పరుగులు చేసిన వారు రిషభ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ 4 వికెట్లు పడగొట్టగా, సౌథీ ఒక వికెట్ తీశాడు.
ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోరుగా ఒక చెత్త రికార్డుగా నమోదైంది. 2021లో ముంబయి వేదికగా కివీస్‌పైనే 62 పరుగులు చేసిన భారత్ ఈ సారి 46 పరుగులతో ఆ రికార్డును మరింత చెత్తగా మార్చుకుంది. అదిలైడ్‌లో 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకే ఆలౌటైన రికార్డుకి ఇది దగ్గరగా ఉంది.
బెంగుళూరులో ఇటీవల వర్షాలు కారణంగా కూడా పిచ్ ఒక్కసారిగా బౌలర్లకు ఆయువు పట్టులా మారింది. దీంతో న్యూజిలాండ్ పేసర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులు సంధించారు. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, తన 26వ టెస్టులో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతను అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న కివీస్ బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు.
This post was last modified on October 17, 2024 2:32 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…