Trends

సన్‌రైజర్స్‌ 2025 రిటెన్షన్‌: క్లాసెన్‌ తో పాటు ఆ ముగ్గురు

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం మెగా వేలం ప్రారంభం కాకముందే, అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ చివరి నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను అందించాల్సి ఉంది. ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను రూ.18 కోట్లకు, అక్షర్ పటేల్‌ను రూ.14 కోట్లకు, స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేయనున్నట్లు సమాచారం.

దిల్లీ జట్టు మొత్తం రిటెన్షన్‌ కోసం రూ.75 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమై ఉంది. ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉండే విధానం అవలంబించనున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా తన కీలక ఆటగాళ్లను మిస్ చేసుకోకుండా ముందడుగు వేసింది.

సన్‌రైజర్స్‌ జట్టు అత్యధిక ధరతో రిటైన్ చేసుకోబోయే ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ కావొచ్చని సమాచారం. పటిష్టమైన హిట్టర్‌గా పేరుపొందిన క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ రూ.23 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లు తెలిపాయి. అలాగే, పాట్ కమిన్స్‌ను కూడా సన్‌రైజర్స్‌ జట్టు రూ.18 కోట్లకు రిటైన్ చేయనుంది.

కెప్టెన్‌గా సేవలు అందించిన కమిన్స్‌ గత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ కు సపోర్ట్ చేసాడు. అతడిని రూ.14 కోట్లకు రిటైన్ చేయనున్నారు. మరోవైపు, ట్రావిస్ హెడ్‌ మరియు ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్‌ తమ జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

This post was last modified on October 17, 2024 9:43 am

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

17 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago