Trends

36 ఏళ్ళుగా విజయం లేదా.. మరి టీమిండియాతో గెలుస్తారా?

బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్‌కు భారత్‌ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం.

చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్‌ఇండియా విజయాన్ని నమోదు చేసింది. విరాట్‌ కోహ్లీ, ధోనీ, రైనా అద్భుత ప్రదర్శనతో భారత్‌ 2-0 తేడాతో ఆ సిరీస్‌ను గెలుచుకుంది. అశ్విన్‌ కీలకమైన ఐదు వికెట్లు తీసి, కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో, భారత్‌ విజయాన్ని సులభంగా చేజిక్కించుకుంది.

కివీస్‌ టెస్టు రికార్డు కూడా 1988 తర్వాత భారత్‌ గడ్డపై పెద్దగా మెరుగు పడలేదు. ఆ సంవత్సరంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ గెలిచిన తర్వాత, ఇప్పటి వరకు 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత కివీస్‌ సుదీర్ఘ కాలం పాటు ఆ దూకుడుని నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కూడా పరాభవం పాలైన కివీస్‌ ర్యాంకింగ్స్‌లో ఆరవ స్థానానికి పడిపోయింది.

భారత్‌పై టెస్టు గెలవడం కివీస్‌కు కష్టమైన సవాలుగా మారింది. ఈ సిరీస్‌ న్యూజిలాండ్‌కి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ చేరే అవకాశాన్ని బలోపేతం చేసే కీలకమైన సిరీస్‌. ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే సిరీస్‌లోనూ కివీస్‌ మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. ఇప్పటివరకు భారత్‌-కివీస్‌ మధ్య జరిగిన 62 టెస్టుల్లో భారత్‌ 22 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్‌ 13 సార్లు మాత్రమే గెలిచింది.

This post was last modified on October 17, 2024 9:37 am

Share
Show comments
Published by
Satya
Tags: Cricket

Recent Posts

అకీరాకు ఏం మిగలవంటున్న పవన్ ఫ్యాన్స్

స్టార్ లెగసి సృష్టించి పెట్టిన తండ్రి వారసత్వాన్ని మోస్తున్న హీరోలకు దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. బాలకృష్ణ, నాగార్జున…

1 hour ago

విచారణకు సజ్జల..పోలీసులకు వేలు చూపించి పొన్నవోలు

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని…

1 hour ago

కేంద్రంలో చంద్రబాబే కింగ్ మేకర్…ఆ ఫొటో వైరల్

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి…

1 hour ago

కృష్ణార్పణం కానున్న మరో శుక్రవారం

కొన్ని శుక్రవారాలు సినీ ప్రియులకు చప్పగా అనిపిస్తాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కు కళ్ళముందు…

2 hours ago

నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత…

3 hours ago

ఒక షెడ్యూల్‌ అయ్యాక రకుల్‌ను తీసేసి..

టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కథానాయికగా…

3 hours ago