ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక త్వరలోనే ఈ స్పెయిన్ బుల్ తన కెరీర్‌కు వీడ్కోలు చెప్పబోతున్నాడు. నవంబర్‌లో స్వదేశంలో జరగనున్న డేవిస్ కప్-2024 టోర్నమెంట్ తర్వాత ఆట నుంచి విరమించుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. ఈ టోర్నీ నాదల్ చివరి మెగా ఈవెంట్ కావడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అభిమానులు అతని ఆటను చివరిసారి ప్రత్యక్షంగా చూడాలని తహతహలాడుతున్నారు. ఇది ఒక సాధారణ టోర్నీ కాదని, డబుల్స్‌లో నాదల్ తన వారసుడిగా భావిస్తున్న కార్లోస్ అల్కరాస్‌తో జట్టుకట్టడం కూడా టికెట్లపై ఆరాటాన్ని పెంచింది. హై రేంజ్ బజ్ ఉన్న నేపథ్యంలో టోర్నీ టికెట్లు విడుదలైన వెంటనే అమ్ముడుపోయాయి. అధికారిక ప్లాట్‌ఫాంలలో అందుబాటులో లేని టికెట్లు ఇప్పుడు రీసెల్లింగ్ సైట్‌లపై భారీ ధరలకు విక్రయించబడుతున్నాయి.
‘వయాగోగో’ అనే రీసెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఓ టికెట్ ధర ఏకంగా 34,500 యూరోలు (సుమారు రూ.31 లక్షలు) పలుకుతున్నట్టు సమాచారం. దీన్ని బట్టి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాదల్ కెరీర్ విషయానికి వస్తే, అతడు టెన్నిస్ ప్రపంచంలో 22 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను సాధించి తనదైన ముద్ర వేశాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు మాత్రమే ఉండడం విశేషం.
అలాగే, 92 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లు, ఒక ఒలింపిక్ బంగారు పతకాన్ని కూడా గెలిచాడు. దశాబ్దాల పాటు టెన్నిస్ అభిమానుల గుండెల్లో నిలిచిన నాదల్ రిటైర్ అవుతుండటంతో, అతని ఆటను చివరిసారి చూడాలనే కోరికతో అభిమానులు టికెట్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
This post was last modified on October 16, 2024 4:10 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…