ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 వేలు, 80 వేలు, 90 వేలు.. ఇలా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. కొన్ని రోజుల కిందట 95 వేల మార్కును దాటి రోజుకు లక్ష కేసుల మార్కు దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకుముందులా కరోనాకు జనం భయపడటం తగ్గించారు కానీ.. ఈ స్థాయిలో కేసులో పెరుగుతూ వెళ్లడం.. దీనికి బ్రేక్ ఎక్కడో తెలియకపోవడం ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ఎట్టకేలకు ఇండియాకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. కరోనా కేసుల తీవ్రత కొంచెం తగ్గింది. ఒక రోజు పెరగడం.. ఒకరోజు కొంచెం తగ్గడం కాకుండా వారం వ్యవధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. గత వారం రోజువారీ సగటు కేసుల సంఖ్య 90 వేలకు అటు ఇటుగా ఉండగా.. ఈ వారం అది 75 వేలకు తగ్గింది.
ఒకసారి ఇలా కొన్ని రోజుల సగటు కేసుల సంఖ్య తగ్గిందీ అంటే.. ఇక అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వెళ్తాయని వరల్డ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే ఈ ఏడాది చివరికి చాలా వరకు ఉపశమనం దక్కబోతున్నట్లే. కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తుండగా.. వ్యాక్సిన్ కూడా వచ్చిందంటే కరోనా ముప్పు నుంచి క్రమంగా బయటపడబోతున్నట్లే. మరి రాబోయే రోజుల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:57 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…