మనకు చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడిపోతాం. బాధను మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. మనల్ని ఎవరైనా గాయపరిస్తే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టం. మరి నోరు లేని మూగజీవాలను దెబ్బ తీస్తే వాటి బాధను అవి ఎలా చెప్పుకోవాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కొందరు వాటి మీద ప్రతాపం చూపించేస్తుంటారు.
మూగజీవాలను హింసించడంలో శాడిస్టిక్ ఆనందం పొందుతుంటారు. కేవలం హింసించడమే కాదు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులర్ అవుదామని చూసేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి శాడిస్టు కుర్రాళ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక కుక్క పిల్ల కాలు పట్టుకుని గాల్లో గిరగిరా తిప్పి విసిరి కొట్టి వినోదం పొందుతున్న శాడిస్టుల వీడియో అది. ఒకరికి ఇద్దరు ఇలా దిగ్భ్రాంతికర రీతిలో కుక్క పిల్లను హింసించారు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ వీడియో కూడా తీసుకున్నారు. అది సోషల్ మీడియాలోకి వచ్చింది. చూసిన వాళ్లందరికీ గుండె తరక్కుపోయేలా ఉన్న వీడియోను లక్షలాది మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో అంటున్నారు.
లొకేషన్ గుర్తు పట్టి ఇలా చేసింది ఎవరో తెలుసుకుని వారికి శిక్ష పడేలా చూడాలని.. ఇలాంటి వారికి బుద్ధి చెప్పకపోతే ఈ తరహా ఉదంతాలు కొనసాగుతాయని నెటిజన్లు అంటున్నారు. ఆ మధ్య చెన్నైలో ఒక వ్యక్తి.. కోతిని మేడ మీది నుంచి విసిరేస్తూ వినోదం చూసిన వీడియో సైతం ఇలాగే వైరల్ అయింది. ఆ వ్యక్తిని గుర్తించిన మూగజీవాల సంరక్షకులు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
This post was last modified on January 17, 2021 2:45 pm
2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన…
2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సాగి తులసి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.…
బాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్లలో విధు వినోద్ చోప్రా ఒకడు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి గొప్ప…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై…