Top Rated

ఈ ‘శంకర్ దాదా’కు కోటా సీటు కావాలట!

మెగా స్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా గుర్తుంది కదా. చదువుకునే వయసు ముగిశాక శంకర్ దాదా వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలో తనదైన మార్కు ప్లాన్ తో సీటు సాధించాడు. అదంతా రీల్ జీవితం అయితే… ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఓ శంకర్ దాదా వైద్య విద్య చదివేందుకు ఓ రేంజి ప్రయాస పడుతున్నాడు. 70 ఏళ్ల వయసులో ఆయన ఎంబీబీఎస్ చదివేందుకు ఇటీవలే నీట్ పరీక్ష రాశారు. వృద్దుడిగా నీట్ రాసిన ఈ శంకర్ దాదా… సీనియర్ సిటిజన్ కోటా అంటూ పెట్టి… అందులోనే తనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కేశారు.

అమితాసక్తి రేపుతున్న ఈ శంకర్ దాదా గురించిన వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కు చెందిన అశోక్ బహార్ వయసు ప్రస్తుతం 71 ఏళ్లు. బహార్ ను డాక్టర్ గా చూడాలని ఆయన తల్లి కోరుకున్నారట. తల్లి కోరిక మేరకు ఇంటర్ పూర్తి కాగానే.. ఎంబీబీఎస్ సీటు కోసం 1974లోనే ప్రవేశ పరీక్షకు హాజరయ్యారట. అయితే నాడు ఆయనకు సీటు రాలేదు. ఆ తర్వాత దాని గురించి ఆయన అంతగా పట్టించుకోలేదట. అయితే ఇప్పుడు వయసు ఉడిగిన సమయంలో 2023లో నీట్ పరీక్ష రాయాలని తీర్మానించారు. నీట్ రాసేందుకు వయో పరిమితి లేని కారణంగా నీట్ కు దరఖాస్తు చేసుకున్న అశో్క్ 2023లో ఒక్క నిమిషం నిబంధనతో పరీక్ష రాయలేకపోయారు.

తాజాగా 2026 నీట్ కూ అప్లై చేసుకున్న అశోక్…ఎంబీబీఎస్ సీటు కోసం పెద్ద యుద్ధమే మొదలెట్టేశారు. నీట్ ఫలితాలు రెండు రోజుల క్రితం విడుదల కాగా.. ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న లక్ష్యంతో ఆయన వ్యూహాత్మకంగా కదిలారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో్ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే.. సీనియర్ సిటిజన్లకూ 1 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన నేరుగా అలహాబాద్ హైకోర్టునే ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు పరిదిలోని లక్నో బెంచ్ లో దాఖలైన ఈ పిటిషన్ పై ఈ నెల 21న విచారణ జరగనుంది. మరి ఈ విచారణలో అశోక్ కు ఏ మేర న్యాయం జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

This post was last modified on July 19, 2026 2:54 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago