Movie News

కమల్‌‌కు మమ్ముట్టి మాట ఇచ్చి మరీ…

జాతీయ అవార్డులు ప్రకటించినపుడు కొన్ని పురస్కారాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అదే సమయంలో కొన్ని అవార్డుల విషయంలో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఆ వ్యక్తికి ఆ అవార్డు రావడం వంద శాతం కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది. 2024 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ‘భ్రమయుగం’ చిత్రానికి మమ్ముట్టిని ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకించే వాళ్లే ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

ఆ సినిమా చూసిన ఎవ్వరూ మమ్ముట్టి నటనను అంత సులువుగా మరిచిపోలేరు. ఇంకే నటుడినీ అందులో ఊహించుకోలేని విధంగా, తనకే సాధ్యమైన హావభావాలతో మమ్ముట్టి వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో మమ్ముట్టి విషపు నవ్వు నవ్వే ఒక సన్నివేశం చాలు.. ఆయనకు ఎన్ని అవార్డులైనా ఇచ్చేయొచ్చు అనిపిస్తుంది. కాబట్టే కొడుమన్ పొట్టి పాత్రకు గాను మమ్ముట్టికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇది మమ్ముట్టి కెరీర్లో ఉత్తమ నటుడిగా నాలుగో జాతీయ అవార్డు కావడం విశేషం. ఆయన 1989లో తొలిసారిగా ‘ఒరు వడక్కన్ వీరగాథ’, ‘మదిలుకల్’ చిత్రాలకు కలిపి.. 1993లో ‘విధేయన్’, ‘పొంతన్ మాడ’ చిత్రాలకు సంయుక్తంగా అవార్డులు అందుకున్న ఆయన.. 2000లో ‘డాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే’ చిత్రానికి ఉత్తమ నటుడిగా మూడో పురస్కారం గెలుచుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆయన కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’తో కలిసి అవార్డును పంచుకుంటున్నారు.

ఇండియాలో అత్యధికంగా నాలుగుసార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్న కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లను మమ్ముట్టి సమం చేశారు. ఈ సందర్బంగా మమ్ముట్టిని అభినందిస్తూ కమల్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

జాతీయ అవార్డుల్లో తనను అధిగమిస్తానని మమ్ముట్టి ఒక సందర్భంలో తనకు మాట ఇచ్చాడని.. ఆ మాట నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడని కమల్ వ్యాఖ్యానించడం విశేషం. కమల్ సినిమాలు బాగా తగ్గించేసిన నేపథ్యంలో ఆయనకు ఇంకో జాతీయ అవార్డు వస్తుందా అన్నది సందేహమే కానీ.. మమ్ముట్టి ఇప్పటికీ విరామం లేకుండా సినిమాలు చేస్తూ, అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో కమల్‌తో అన్నట్లే అయిదో జాతీయ అవార్డుతో ఆయన్ని అధిగమిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

This post was last modified on July 19, 2026 10:44 pm

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

2 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

2 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

3 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

7 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

7 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

7 hours ago