Movie News

అభిమానులకు చిరు కానుక… 5 లక్షల ఇన్సూరెన్స్

ప్రేక్షకులను దేవుళ్లుగా అభివర్ణిస్తారు. అభిమానులు లేకపోతే తాము లేమంటారు. కానీ ఆ ప్రేక్షకులు, అభిమానుల కోసం సినీ జనాలు ఏం చేస్తారు అంటే.. జవాబు కనిపించదు. మాటలతో వాళ్లను కొనియాడడమే తప్ప, సామాన్య ప్రేక్షకులు, అభిమానుల కోసం చేయి అందించేవాళ్లు అరుదు. ఐతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక గొప్ప సాయం అందబోతోంది.

ఎన్నో ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా ఉంటూ.. ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులకు రూ.5 లక్షల మేర ఆరో బీమా చేయించబోతున్నారు. ఈ బాధ్యతను అఖిల భార చిరంజీవి యువత చేపట్టబోతోంది. దీనికి మెగాస్టార్ కూడా చేయూత అందించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరుతో సన్నిహితంగా మెలిగే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు.. మెగాస్టార్ అభిమానులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించాడు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈసారి చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15 నుంచి వారం పాటు ఉత్సవాలు చేయబోతున్నారు.

ఇందులో భాగంగా గత 30 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి మీద అమితమైన అభిమానం చూపిస్తూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న సీనియర్ అభిమానులను గుర్తించి, వారికి ఈ వారోత్సవాల్లో 5 లక్షల ఇన్సూరెన్స్ అందించబోతున్నారు. ముందుగా గుంటూరు జిల్లాలో వచ్చే నెల ఈ ఇన్సూరెన్స్ పాలసీని అందించే కార్యక్రమం మొదలవుతుందని రవణం స్వామి నాయుడు ప్రకటించారు.

This post was last modified on July 19, 2026 4:50 pm

Share

Recent Posts

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

14 minutes ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

56 minutes ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

2 hours ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

3 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

4 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

5 hours ago