అన్నగారి భార్య ఆవేదన

అన్నగారి భార్య ఆవేదన

స్వర్గీయ నందమూరి తారకరామారావు భార్య లక్ష్మి పార్వతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేస్తూ, ఆ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేని పరిస్థితి. స్వర్గీయ ఎన్టీఆర్‌కి లక్ష్మీ పార్వతి రెండో భార్య. మొదటి భార్య పరమపదించిన చాలా ఏళ్ళ తర్వాత లక్ష్మీపార్వతిని పెళ్ళాడిన ఎన్టీఆర్‌, ఆమెను తన అర్ధాంగిగా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కి సేవలు చేసింది లక్ష్మీపార్వతి మాత్రమే.

కుటుంబ వివాదాలు, మిగతా రాజకీయ ఆరోపణలు ఎన్నయినా ఉండవచ్చునుగాని స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ అది కూడా పార్లమెంటులో జరుగుతున్నప్పుడు లక్ష్మీపార్వతిని ఆహ్వానించాలి. పద్ధతి ప్రకారం రాజీవ్‌గాంధీ రాజకీయ వారసురాలిగా సోనియా ఎలా అయ్యారో, అంతటి గౌరవం లక్ష్మీపార్వతికీ ఎన్టీఆర్‌ విషయంలో దక్కాల్సిందే. కాని దక్కడంలేదు. అందుకే ఆమె ఆవేదన చెందుతున్నారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకునేదెవ్వరు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English