తమ్ముళ్లకు ఊహించని షాకిచ్చిన అమిత్ షా

తమ్ముళ్లకు ఊహించని షాకిచ్చిన అమిత్ షా

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. డిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా సంచలనంగా మారింది. ఏపీ మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. రద్దును ఆపగలిగే శక్తి కేంద్రానికి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాలని భావించారు.

ఆయనకు విషయాన్ని చెప్పి.. మండలి రద్దుకు చెక్ పెట్టాలన్న విన్నపాన్ని కోరాలని భావించారు. అయితే.. ఇప్పటికే ఇదే అంశం మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రితో కూడా చర్చలు జరిపి.. వారి చేత ఎస్ అన్న మాటను చెప్పించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మండలి మూత సాంకేతిక అంశమేనన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. మండలి రద్దును అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు.

మండలి రద్దు అంశంపై తమ వాదన వినాలని.. అవసరం లేకున్నా రద్దు చేయాలని ఏపీ సర్కారు అనుకుంటుందని.. దాన్ని అడ్డుకోవాలన్న విషయాన్ని అమిత్ షా చెవిలో వేయాలని భావించారు. మండలిని ప్రోరోగ్ చేయటాన్ని ఢిల్లీ నేతల ముందు పెట్టాలన్న ఆలోచనలో ఉన్న వారు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు.

అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్సీలను కలిసేందుకు ఆయనకు టైం లేదన్న విషయాన్ని చెప్పటంతో వారంతా విస్తుపోయేపరిస్థితి. ఇదిలా ఉంటే.. ఏదోలా అమిత్ షాను కలవాలన్న పట్టుదలతో టీడీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. అందుకే రెండు రోజులు దేశ రాజధానిలో  ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కలుసుకునే వీలు కలిగినా.. మిగిలిన పెద్దల అపాయింట్ మెంట్లు ఏవీ కన్ఫర్మ్ కాకపోవటంతో టీడీపీ ఎమ్మెల్సీలకు మింగుడుపడటం లేదు.

పనిలో పనిగా రాష్ట్రపతి.. ప్రధాని కలుసుకోవాలని వారు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నారు. షా నో చెప్పిన వేళ.. మిగిలిన వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పడు ఉత్కంటగా మారిందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English