మోదీపై కేసీఆర్ క‌న్నెర్ర‌..ఇక పోరాట‌మేన‌ట‌

మోదీపై కేసీఆర్ క‌న్నెర్ర‌..ఇక పోరాట‌మేన‌ట‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏకంగా, మోదీ వ్య‌తిరేక ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌ట‌. ఇందుకు ఢిల్లీ వేదిక కాకుండా త‌న హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించాల‌ని కేసీఆర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. అంతేకాకుండా, తానే ఆతిథ్యం ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ట‌. ఇదంతా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న నేప‌థ్యంలో వారితో గ‌లం విప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న ఆయ‌న ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని వెల్ల‌డించారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత‌మైన విజ‌యం సాధించిన నేప‌థ్యంలో విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఏఏ బిల్లు అనేది తప్పుడు నిర్ణయం అని  సీఎం కేసీఆర్ అన్నారు. బిల్లులో ముస్లింలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. సీఏఏపై చాలా మంది సీఎంలతో మాట్లాడిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. 16మంది సీఎంలు-మాజీ సీఎంలు సీఏఏకు అనుకూలంగా లేరని ఆయ‌న పేర్కొన్నారు. త్వరలోనే దేశంలోని సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు తానే ఆతిథ్యం ఇస్తాన‌ని తెలిపారు.  సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని విరమించుకోవాలని అన్నారు. భార‌త్‌ను హిందుమత దేశంగా మార్చేందుకు బీజేపీ చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు.

ఇదిలాఉండ‌గా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ఆందోళనలు చల్లారడం లేదు. సీఏఏకు వ్యతిరేకంగా రాజ‌స్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇలాగే చేశాయి. అయితే స‌భ‌లో తీర్మానం ప్రవేశపెట్టిన స‌మ‌యంలో.. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకువెళ్లారు. సీఏఏను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా… సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English