నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి..

నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి..

పౌరసత్వం చట్టం తరువాత దేశంలో రాజకీయ వర్గాలు మరింతగా చీలిపోయాయి. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు, తీవ్రంగా బలపరుస్తున్నవారు తమతమ వాదనలను వినిపించే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దీనిపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని సూచించారు. దీన్ని వ్యతిరేకించివారిని బ్రేకుల్లేని బస్సుల్లో ఎక్కించి పాకిస్థాన్ కు పంపుతామని అన్నారు.

సీఏఏకు అనుకూలంగా వరంగల్ లో నిర్వహించిన ర్యాలీ, సభలో ఆయన మాట్లాడుతూ, సీఏఏను వ్యతిరేకించే వాళ్లకు ఇక్కడ స్థానం లేదని, అవసరమైతే, పాకిస్థానో, బంగ్లాదేశో లేక ఆఫ్ఘనిస్థానో వెళ్లిపోవాలని, కావాలంటే, విమానాలు, హెలీకాప్టర్లు, బ్రేకుల్లేని బస్సులు కూడా ఇస్తామంటూ ధ్వజమెత్తారు. సీఏఏ చట్టానికి సంబంధించిన వాస్తవ విషయాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు తెలియజెప్పాలని, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ఈ కుహనా లౌకికవాదులకు బుద్ధి వచ్చే వరకూ ఈ తరహా ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.

కాగా సంజయ్ ఎంపీగా గెలిచిన తరువాత తెలంగాణలో బీజేపీ దూకుడు కాస్త పెరిగిందన్న వాదనలున్నాయి. ఆయన తొలి నుంచి కరడుగట్టిన హిందూవాది కావడం.. ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు కావడంతో పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ, పార్టీని డిఫెన్స్ చేయడంలో కానీ దూకుడుగా ఉన్నారని.. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా బీజేపీ నాయకులకు భిన్నంగా సంజయ్ నిత్యం పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English