నెహ్రూను మించిన రేపిస్ట్ లేరట

నెహ్రూను మించిన రేపిస్ట్ లేరట

దిశ అత్యాచార ఘటన.. ఆ తరువాత నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో దేశమంతా దీనిపై చర్చ జరుగుతున్న వేళ ఈ అంశం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకూ తావిస్తోంది. ఈ క్రమంలోనే దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన సాధ్వీ.. నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు నడయాడిన పుణ్యభూమి మన దేశమని, అలాంటి దేశంలో నెహ్రూ అతిపెద్ద రేపిస్ట్ అని, దేశ సంస్కృతిని నాశనం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అక్కడితో ఆగని ఆమె టెర్రరిజం, నక్సలిజం, అవినీతి, అత్యాచారాల వంటివన్నీ నెహ్రూ కుటుంబం ఈ దేశానికి ఇచ్చిన బహుమతులేనని అన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రాచీ డిమాండ్ చేశారు. కాగా ప్రాచీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశ ప్రథమ ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ మండిపడుతున్నారు. బీజేపీ నేతలే రేపిస్టులంటూ ఉన్నావ్ ఘటన వంటివాటిని ఉదహరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English