జ‌గ‌న్ అమెరికా యాత్ర‌.. చ‌క్రం తిప్పిన ఆ ఇద్ద‌రు

జ‌గ‌న్ అమెరికా యాత్ర‌.. చ‌క్రం తిప్పిన ఆ ఇద్ద‌రు

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. రెండు రోజుల కిందట అగ్ర‌రాజ్యం అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. పెట్టుబడుల సాధ‌న‌, అక్క‌డి తెలుగు వారితో మ‌మేకం అయ్యేందుకు జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న‌ను నిర్దేశించుకున్నారు. ఈయ‌న వెంట‌.. జ‌గ‌న్ స‌తీమ‌ణి.. భార‌తి, ఎంపీ మిథున్ రెడ్డి స‌హా కొంద‌రు స‌ల‌హా దారులు కూడా వెళ్లారు.

మొత్తానికి ఈ పర్య‌ట‌న‌లో జ‌గ‌న్‌.. ఏపీ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అయితే, వాస్త‌వానికి ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ అమెరికాలో ప‌ర్య‌టించ‌డం వెనుక వాతావ‌ర‌ణం వేరే ఉంద‌ని తెలుస్తోంది.

జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఆ మాట‌కొస్తే.. దివంగ‌త‌ వైఎస్‌తో ఎన‌లేని బంధాన్ని పెన‌వేసుకున్న ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు ఇప్పుడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు క‌ర్త‌, క‌ర్మ క్రియ‌గా చెప్పుకొంటున్నారు. పైకి వారు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. అన్నీతామై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

వారిలొ ఒక‌రు ప్ర‌ముఖ భాషాప్రేమికుడు, కేంద్ర హిందీ సాహిత్య అకాడ‌మీ స‌భ్యుడిగా ఉన్న యార్ల‌గ‌డ్డ‌ల‌క్ష్మీప్ర‌సాద్‌. మ‌రొక‌రు, మేడ‌పాటి వెంక‌ట రెడ్డి. ఈ ఇద్ద‌రూ కూడా ఇప్పుడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు కీల‌కంగా ఉన్నార‌ని స‌మాచారం.

వీరి సూచ‌న‌లు, స‌ల‌హా మేర‌కే జ‌గ‌న్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నార‌ని అంటున్నారు జ‌గ‌న్ స‌న్నిహితులు. యార్ల‌గ‌డ్డ‌ను ఇటీవ‌లే.. జ‌గ‌న్ తెలుగు భాషా సంఘానికి చైర్మ‌న్‌గా చేశారు. ఇక‌, అమెరికాలోనే స్థిర‌ప‌డిన మేడ‌పాటి.. వైసీపీకి అత్యంత సానుభూతి ప‌రుడిగా ఆది నుంచి చ‌క్రం తిప్పుతున్నారు. ఈ ఇద్ద‌రికీ.. అమెరికాలో అనేక మంది పారిశ్రామిక వేత్త‌లు స‌హా.. ప్రభుత్వంలోని పెద్ద‌ల‌తోనూ ప్ర‌త్య‌క్ష, ప్ర‌త్యేక సంబంధాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఏపీకి పెట్టుబ‌డుల విష‌యం తాము చూసుకుంటామ‌ని, జ‌స్ట్ మీరు వ‌చ్చి క‌నిపించి వెళ్తే చాల‌ని వారిద్ద‌రూ జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ హుటాహుటిన అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English