రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వెంక‌య్య త‌ప్పు చేశారు: ర‌జ‌నీకాంత్‌

రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వెంక‌య్య త‌ప్పు చేశారు: ర‌జ‌నీకాంత్‌

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇవి జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. చెన్నైలో తాజాగా జ‌ర‌గిన లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్.  పుస్త‌కా విష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి అమిత్ షా.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఉవ్విళ్లూరుతున్న ర‌జ‌నీ కూడా వ‌చ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. వెంక‌య్య నాయుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌ప్పు చేశార‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క‌సారిగా స‌భ‌లో ఉన్న వారంతా నివ్వెర పోయారు.

ఇదేమైనా రాజ‌కీయ స‌భా.. అనుకున్నారు. ఆ స‌మ‌యంలో వేదిక‌పైనే ఉన్న వెంక‌య్య బిత్త‌ర పోయారు.  అయితే, ఆవెంట‌నే త‌న ప్ర‌సంగాన్ని  కొన‌సాగించిన ర‌జ‌నీ.. వెంక‌య్య‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వెంకయ్య నాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని, ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కాకుండా.. ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్లి ఉంటే ఓ గొప్ప మార్గదర్శ కుడయ్యేవారని ప్రశంసించారు. అలాంటి ఆధ్యాత్మిక వేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీకాంత్ చెప్పారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు వెల్లి విరిశాయి.

మొత్తానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తూ.. అడుగులు వెన‌క్కి వేస్తున్న ర‌జ‌నీ.. ఇలా వ్యాఖ్యా నించే స‌రికి.. వెంక‌య్య ఒకింత ఆశ్చ‌ర్య పోయారు. నిజానికి వెంక‌య్య ఏరంగంలో ఉన్నా దానికివ‌న్నె తెచ్చారు. రాజ‌కీయాల్లో ఉండ‌గా.. ఆయ‌న ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పార్టీ మార‌డం కానీ, పెద్ద‌ల‌ను దూషించ‌డం కానీ చేయ‌లేదు. ఇక‌, కేంద్ర మంత్రిగా ఉన్నప్ప‌టికీ త‌న సొంత రాష్ట్రాన్ని ప్రేమించ‌డంలోను, రాష్ట్రానికి కేంద్రం నుంచి వ‌చ్చే వ‌న‌రుల‌ను అందించ‌డంలోనూ ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించారు. ఇక‌, మాతృభాషా ప్రేమికుడుగా, ప్ర‌కృతి ప్రేమికుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. మొత్తంగా తాజా ఘ‌ట‌న ఆస‌క్తిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English