వైఎస్ బ‌ర్త్ డే వేళ‌.. సాక్షికి ప్ర‌క‌ట‌న‌ల విందు!

 వైఎస్ బ‌ర్త్ డే వేళ‌.. సాక్షికి ప్ర‌క‌ట‌న‌ల విందు!

నీతులు చెప్పినంత ఈజీ కాదు.. ఆ నీతుల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌.. ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో అదే ప‌నిగా త‌ప్పులు ప‌ట్టేవారు. చేసింది త‌క్కువైనా.. ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌చారం చేసుకునేది ఎక్కువ‌ని జ‌గ‌న్ చెప్పేవారు. అలాంటి యువ‌నేత తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న వేళ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి?  ప్ర‌క‌ట‌న పందేరాన్ని ప‌క్క‌న పెట్టి ఆద‌ర్శంగా నిల‌వ‌ట‌మే కాదు.. మిగిలిన వారికి స్ఫూర్తిని రేకెత్తించేలా ఉండాలి.

తాజాగా అందుకు భిన్నంగా వ్యవ‌హ‌రించ‌టం ద్వారా.. మిగిలిన వారికి తానేమీ తీసిపోన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు జ‌గ‌న్‌. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌క‌ట‌న‌ల విందు చేశారు జ‌గ‌న్‌. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు తాను ఏ విష‌యాల్ని అయితే చంద్ర‌బాబు స‌ర్కారు లోపాలుగా ఎత్తి చూపారో.. అంత‌కు రెండింత‌లు తాను చేయ‌టం ద్వారా.. మాట‌లకు చేత‌ల‌కు సంబంధం ఉండ‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. వైఎస్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని త‌న సొంత మీడియా సంస్థ‌కు ఏకంగా నాలుగు పేజీల ప్ర‌క‌ట‌న‌ల్ని ఇవ్వ‌టం ద్వారా భారీ విందు చేశార‌ని చెప్పాలి.

ఏపీతో స‌రిపెట్ట‌కుండా గ్రేట‌ర్ హైద‌రాబాద్ తో పాటు.. తెలంగాణ ఎడిష‌న్ లోనూ రెండేసి పేజీల చొప్పున ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం ద్వారా కోట్లాది రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేశార‌ని చెప్పాలి. తాను వ్య‌తిరేకించే ఒక ప‌త్రిక‌కు మిన‌హాయించి ఏపీలోని కొన్ని ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న విందును పంచిపెట్టారు. ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో విప‌క్ష నేత‌గా ఉన్న కాలంలో తాను చెప్పిన నీతుల‌కు భిన్నంగా తాజా ప్ర‌క‌ట‌న‌ల పందేరం భారీగా సాగింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ‌.. కోట్లాది రూపాయిల ప్ర‌క‌ట‌న‌ల్ని ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English