ఒక్క ఫొటో.. టీవీ-9 రవిప్రకాశ్ ధైర్యానికి కారణం చెప్పేసింది

ఒక్క ఫొటో.. టీవీ-9 రవిప్రకాశ్ ధైర్యానికి కారణం చెప్పేసింది

టీవీ 9.. తెలుగు నాట ఈ న్యూస్ చానల్ ఎంత సంచలనమో.. ఇప్పడు ఆ చానల్ ఒకప్పటి కీలక వ్యక్తుల్లో ఒకరైన రవిప్రకాశ్ వ్యవహారమూ అంతే సంచలనంగా మారింది. టీవీ9 విక్రయం.. దానిపై పట్టు కోసం ఆధిపత్య పోరు.. వాటాల విక్రయం వంటి అనేకానేక సంక్లిష్ట వ్యవహారాలలో భాగంగా ఫోర్జరీ ఆరోపణలతో నిన్నమొన్నటి వరకు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగి రవిప్రకాశ్ మొన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. ఫోర్జరీ వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు విచారించి వదిలేశారు.. ఆ తరువాత అయినా ఆయన్ను అరెస్టు చేస్తారని అంతా భావించారు. కానీ, రవి ప్రకాశ్‌ విచారణకు సహకరించకపోయినా కూడా ఆయన్ను అదుపులో ఉంచుకోలేదు పోలీసులు. పైగా రవి ప్రకాశ్ కూడా చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది.. అది చూసినవారంతా ఓహో రవి ప్రకాశ్ ధైర్యానికి ఇదా కారణం అనుకుంటున్నారు.

ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫొటోలో రవి ప్రకాశ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. అది కూడా మామూలుగా కాదు. ఒకే సోఫాలో ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. చుట్టూ ఉన్నవారు నిల్చుని కనిపిస్తున్నారు. ఈ ఒక్క ఫొటో రవి ప్రకాశ్ స్థాయేంటే.. ఆయనెందుకంత ధైర్యంగా ఉన్నారో.. ఆయనకు అండగా ఎవరున్నారో చెప్పేసింది. రవి ప్రకాశ్‌కు బీజేపీ అగ్రనేతల దన్ను ఉందని తెలియడంతోనే తెలంగాణ పోలీసులు, వారిని నడిపించే టీఆరెస్ ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.

అయితే.. ఈ వివాదాస్పద వ్యవహారంలో బీజేపీకి ఎందుకు ఆసక్తిగా ఉంది.. రవి ప్రకాశ్‌కు అండగా నిలుస్తోందన్న అనుమానాలూ ఉణ్నాయి. కానీ, దానికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. బీజేపీ తెలంగాణలో విజయావకాశాలు వెతుక్కుంటున్న వేళ రవిప్రకాశ్ వంటి మీడియా కింగ్ చేతిలో ఉంటే అవసరమైతే ఇంకో చానల్ పెట్టించి బీజేపీ గళం వినిపించొచ్చన్నది ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ, రవి ప్రకాశ్ పరస్పర అవసరాలు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం ఇస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు... రవి ప్రకాశ్ వంటి మీడియా దిగ్గజాన్నే కేసీఆర్ అణచగలిగితే ముందుముందు ఇంకా కష్టమని.. కాబట్టి రవి ప్రకాశ్‌కు ఒక గట్టి భరోసా ఇస్తే ఆయన కేసీఆర్‌ను ఎదుర్కోగలరని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English