ఆ ఒక్కడు 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో సమానం

ఆ ఒక్కడు 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో సమానం

రాజకీయాల్లో కొందరు నాయకులు నిర్మించుకున్న ఇమేజ్, సాధించుకున్న పట్టు, నమ్మకం వంటివి మిగతావారి నుంచి వారిని వేరు చేస్తాయి. అలాంటి నాయకుల్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఒకరు. శాసనసభ అయినా, శాసన మండలి అయినా ఆయన హౌస్‌లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరిపీల్చుకుంటుంది.

ఏ సబ్జెక్ట్‌పైనైనా మాట్లాడగలిగే  సామర్థ్యం, ఎవరి నోరైనా మూయించగల దమ్ము ఉన్న నేత ఆయన. అందుకే... తెలంగాణ శాసన మండలిలో తమ బలం తగ్గిపోయి టీఆరెస్ బలం పెరిగిపోతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు తమకు జీవన్ రెడ్డి ఉండగా బయమేల అంటున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీ చేసిన మూడు స్థానాలలో ఓడిపోవడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ చాలా కాన్ఫిడెంటుగా మాట్లాడారు. 'శాసనమండలిలో 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నా ఒకటే, మా జీవన్ రెడ్డి ఒక్కడున్నా ఒకటే'నని అయన అన్నారు. ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా సమర్థంగా ఎదుర్కోగల సత్తా జీవన్ రెడ్డికి ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి ఓటమిపైనా జగ్గారెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద డబ్బు లేదని.. డబ్బు ఉంటే గెలిచేవారని..  వారి వద్ద డబ్బు లేకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదని, ఎప్పుడూ అధికార పక్షానికి అనుకూలంగానే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English