పవన్ ని అనడం మాని పవన్ కి అండ గా నిలవండి

పవన్ ని అనడం మాని పవన్ కి అండ గా నిలవండి

ప్రస్తుతం జనసేన పార్టీ ఒక తీవ్ర సంక్షభంలో ఉందని చెప్పాలి. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో, అసలు జనసేనకు ప్రజలు అందించిన ఓటమి అనేది ఎంత ఘాటుగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. కాని మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు జనసేన ఎందుకు ఓడిపోయింది అనే కారణం చెబుతూ, ఆ పార్టీలోని కొందరు కార్యకర్తలు సోషల్ మీడియా సాక్షిగా నానా రచ్చ చేస్తున్నారు.

పవన్ అసలు సరైన అభ్యర్ధులకు ఛాన్స్ ఇవ్వలేదని ఒకరు, సరైన రాజకీయ ప్రణాళికను ఎంచుకోలేదని ఒకరు, పొలిటికల్ స్ర్టాటజిస్ట్ ను ఎంచుకోవడంలో జనసేన విఫలమైందని ఒకరు, చుట్టూ తన ఫ్యాన్స్ ను సలహాదారులుగా పెట్టుకుని పవన్ తప్పుచేశాడని ఒకరు, పవన్ ను ప్రజలు నమ్మలేదని ఒకరు.. ఇలా చాలామంది చాలా కామెంట్లు చేశారు. కొంతమంది అయితే, 'ఒకవేళ నాలాంటి హార్డ్ కోర్ కార్యకర్తలకు సీట్లు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా 50 చోట్ల ఈజీగా గెలిచేవాళ్ళం' అంటూ ఫేస్ బుక్కుల్లో పోస్ట్ చేస్తున్నారు. అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వారు, కేవలం పవన్ కళ్యాణ్‌ సామాజివర్గం కాబట్టి జనసేనలో చేరిపోయినోళ్లు, కనీసం బి-ఫామ్ కూడా నింపడం రానోళ్ళు, ఇప్పుడు పవన్ ను బ్లేమ్ చేస్తూ ఇలాంటి పోస్టులు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది.

ఒక ప్రక్కన నలభై ఏళ్ళ సుదీర్ధ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీయే వైఎస్ జగన్ హవాలో కొట్టుకుపోయింది. హేమాహేమీలే ఎలక్షన్లో ఓడిపోయారు. కాకలు తిరిగిన రాజకీయ నాయకులే కుదేల్ అయిపోయారు. ఈ సమయంలో పవన్ తో పాటు సైలెంటుగా ఉండి, 2024 ఎలక్షన్లకు సన్నద్దమవ్వడం తప్పించి.. మేం ఉండుంటే 50 గెలిచేవారం 40 గెలిచేవారం అంటూ కామెంట్లు చేయడంలో కొందరు జనసైనికుల అపరిపక్వతకు నిదర్శనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English