55 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు

55 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు

రాజకీయ వ్యవస్థలో మార్పులొచ్చాక...ప్రజాప్రతినిధులపై నేరాభియో గాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్ని కేసులుంటే.. అంత టాప్‌ లీడర్‌ అనేవిధంగా పార్టీలు భావిస్తున్నాయని కొంద‌రు ప్ర‌జాస్వామ్య ప్రేమికులు వాపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన విస్తుగొలిపే గణాంకాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) మ‌రియు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ష‌న్ వాచ్ (ఏపీఈడబ్ల్యూ) విడుదల చేసింది. వీరి ప్ర‌కారం 55 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.

174 మంది కొత్త‌గా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో 151 మంది త‌మ క్రిమిన‌ల్ కేసుల నేర‌చ‌రిత్ర గురించి తెలియ‌జేయ‌గా...వారిలో 55 మందిపై ఈ త‌ర‌హా కేసులు ఉన్న‌ట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ మ‌రియు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ష‌న్ వాచ్ విశ్లేష‌ణ‌లో తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి త‌న‌పై మ‌ర్డ‌ర్ కేసు ఉంద‌ని పేర్కొన‌గా ఆ పార్టీకి చెందిన మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు త‌మ‌పై అటెంప్ట్ మ‌ర్డ‌ర్ కేసు ఉంద‌ని వెల్ల‌డించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన అంశాల్లో నేరాభియోగాలను ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల విష‌యంలో వివిధ అవాంచిత చ‌ర్య‌ల వ‌ల్ల వారిపై ఈ కేసులు  న‌మోదు అయ్యాయి. మ‌రోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలు త‌మ‌పై కిడ్నాప్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని పేర్కొన్నారు.

మొత్తం యాభై మంది ఎమ్మెల్యేల‌లో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, న‌లుగురు టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యే ఒక్క‌రు త‌మ‌కు క్రిమిన‌ల్ కేసుల నేప‌థ్యం ఉంద‌న్నారు. ఎమ్మెల్యేలు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల ఆధారంగా ప‌రిశీలించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ష‌న్ వాచ్ ఈ నివేదిక రూపొందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మారీ అఫిడ‌విట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వెబ్‌సైట్లో స‌మ‌గ్రంగా అప్‌లోడ్ చేసి ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న వివ‌రాలు విస్ప‌ష్టంగా తెలియ‌రాలేద‌ని పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English