ఢిల్లీలో మోడీ.. ఏపీలో జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో కేసీఆర్

ఢిల్లీలో మోడీ.. ఏపీలో జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో కేసీఆర్

సుదీర్ఘంగా సాగిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో కీల‌క‌మైన అన్ని విడ‌త‌ల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిశాయి. ఈ క్ష‌ణం కోస‌మే ఎదురుచూస్తున్న మీడియా సంస్థ‌లు.. స‌ర్వేలు నిర్వ‌హించి వివిధ సంస్థ‌లు.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొన్న సాయంత్రం ఆరు గంట‌లు దాటిన వెంట‌నే..తాము చేయించిన స‌ర్వే వివిరాల్ని పోటాపోటీగా విడుద‌ల చేశాయి.

ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌తో పాటు.. ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ ను వివిధ స‌ర్వే సంస్థ‌లు నిర్వ‌హించాయి. మ‌రిన్ని సంస్థ‌లు ఏం చెప్పాయి?  అంద‌రి మాట ఏమిటి? అన్న విష‌యాల్లోకి వెళితే..

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించే మూడు అంశాల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే.. కేంద్రంలో మోడీ స‌ర్కారు ఖాయ‌మ‌ని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసిన సంస్థ‌ల్లో అత్య‌ధికులు కేంద్రంలో ఎన్డీయేకు 280 నుంచి 320 సీట్లు ఖాయ‌మ‌ని తేల్చేశాయి. ఏ సంస్థ కూడా కాంగ్రెస్‌కు 120 సీట్ల కంటే అత్య‌ధికం వ‌స్తాయ‌ని పేర్కొన‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇక.. తెలుగు ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ‌స్తే.. ఏపీలో ప‌వ‌ర్ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిదేన‌ని తేల్చాయి ల‌గ‌డ‌పాటితో పాటు రెండు మూడు సంస్థ‌లు మిన‌హాయిస్తే.. మిగిలిన వారంతా జ‌గ‌న్ కే ఓటేశాయి.

తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. టీఆర్ఎస్ కు అత్య‌ధిక సీట్లు ఖాయ‌మ‌ని.. కేసీఆర్ చెప్పిన‌ట్లు 16 సీట్లు ఆయ‌న ఖాతాలో ప‌డినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా వెల్ల‌డించాయి. కొన్ని సంస్థ‌లు మాత్రం 13-14 సీట్లు ఖాయ‌మ‌న్నాయి. ఏమైనా మొత్తం ఎగ్జిట్ పోల్స్ సారాన్ని ఒక్క లైనులో చెప్పాలంటే కేంద్రంలో మోడీ.. ఏపీలో జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో కేసీఆర్ కు ఎదురులేదు.. తిరుగులేద‌ని తేల్చేశాయ‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English