కర్నాటక ఎన్నికల్లో రాహుల్ ద్రావిడ్ హిట్ వికెట్

కర్నాటక ఎన్నికల్లో రాహుల్ ద్రావిడ్ హిట్ వికెట్

శకునం చెప్పే బల్లే కుడితిలో పడడం అంటే ఇదే. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఈసీ తరఫున ప్రచారం చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తాను మాత్రం ఓటేయడం లేదట. కారణం తెలిస్తే ఇంకా షాకవుతారు. ఎందుకంటే ఆయన ఓటు గల్లంతైంది.

అయితే.. ద్రవిడ్ ఓటు గల్లంతు కావడానికి కారణం ఆయన స్వయం కృతాపరాధమేనని టాక్.  ద్రవిడ్‌ తన అడ్రస్‌ మార్చడంతో ఫార్మ్‌-7  ద్వారా ఓటును తీసేశారు. ఈ ఫార్మ్‌-7ను అతని సోదరుడు ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కానీ ద్రవిడ్‌ మాత్రం ఫార్మ్‌-6తో మళ్లీ తనపేరును నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఏప్రిల్‌ 18న కర్నాటకలో జరిగే పోలింగ్‌లో ద్రావిడ్ ఓటేసే చాన్సు పోయింది.

కాగా ఈసీ ప్రచారకర్త ఓటే లేకపోవడంపై మీడియాప్రతినిధులు ఎన్నికల సంఘం అధికారులను ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ద్రవిడ్ కొత్త అడ్రస్‌కు అధికారులు రెండుసార్లు వెళ్లారట.. కానీ, కానీ ద్రవిడ్‌ కటుంబసభ్యులు వారిని అనుమతించలేదట.. ద్రవిడ్ విదేశాల్లో ఉన్నారని సమాధానం చెప్పి పంపించేశారట.  

ఈ విషయంపై కర్ణాటక ఎలక్షన్‌ చీఫ్‌ సంజీకుమార్‌ మాట్లాడుతూ.. ‘అడ్రస్‌ మారడంతో ద్రవిడ్‌ తన ఓటును స్వచ్ఛందగా తొలిగించుకున్నారు. కానీ మళ్లీ ఓటును పొందే విషయాన్ని మరిచిపోయారని.. ఇప్పుడు ఓటరు జాబితాలో అతని పేరును చేర్చడం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English