పవన్‌కళ్యాణ్‌ని తొక్కడం అంత తేలికా?

పవన్‌కళ్యాణ్‌ని తొక్కడం అంత తేలికా?

పవన్‌కళ్యాణ్‌ పాలిటిక్స్‌ పరంగా ఎంత సీరియస్‌గా వున్నాడనేది తొలి అటెంప్ట్‌లోనే తెలియజెప్పాడు. ఈసారి ఎన్నికలలో తన పార్టీ ప్రభావం చూపించగలదే తప్ప విజయం సాధించలేదని అతను గ్రహించాడు. పార్టీ బలంగా వున్న ఏరియాలు గుర్తించి ప్రచారంలో అక్కడే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. అతనిది అసలు పార్టీనే కాదని తీసి పారేసినా కానీ పవన్‌ వల్ల నష్టం వస్తుందని ప్రధాన పార్టీలు రెండింటికీ బాగా తెలుసు. పవన్‌ ఈసారి తన ఉనికి చాటుకుని, ఈ అయిదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నట్టయితే వచ్చే ఎన్నికలకి ఒక శక్తిగా ఎదుగుతాడని కూడా వారు గ్రహించారు. అందుకే పవన్‌ని రెండు చోట్లా ఓడించి జనసేనని నైతికంగా దెబ్బ తీయాలని రెండు ప్రధాన పార్టీలు చాలా కృషి చేసాయి.

దీంతో అవలీలగా గెలిచేస్తాడని భావించిన గాజువాక సీట్‌ కూడా అనుమానంగానే వుందని అంటున్నారు. భీమవరంలో మొదట్నుంచీ టఫ్‌ ఫైట్‌ అనేది తెలుసుకున్నారు. కానీ పవన్‌ ఈ రెండు నియోజికవర్గాల్లో విస్తృత ప్రచారం చేసి తన విజయావకాశాలని మెరుగు పరుచుకున్నాడు. అయితే చివర్లో బూత్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో జనసేన వెనకబడిందని, అంచేత రెండు చోట్ల పవన్‌కి ఎదురుగాలి తప్పదని అంటున్నారు. పవన్‌ని అణచివేయాలనేది ప్లాన్‌ అయినా కానీ అంత ప్రజాదరణ వున్న వ్యక్తిని అంత తేలిగ్గా తొక్కేయగలరా? పవన్‌ తప్పక గెలుస్తాడనే ధీమా వుండడం వల్లే బెట్టింగ్స్‌ కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే పవన్‌ మాత్రం తనకేమీ పట్టనట్టు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ప్రజలతో కలిసిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English