ఎన్టీఆర్‌ని వాడుకుంటోన్న వైసిపి?

 ఎన్టీఆర్‌ని వాడుకుంటోన్న వైసిపి?

జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాలకి ఆమడ దూరంగా వుంటున్నాడు కానీ అతని ప్రస్తావన మాత్రం ఏదో విధంగా వస్తూనే వుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగినపుడు ప్రచార పర్వానికి దూరంగా వున్న తారక్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకి కూడా అంతే దూరం మెయింటైన్‌ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంటోన్న తారక్‌ని వైసిపికి దగ్గరగా వున్నాడని చూపించే ప్రయత్నం అయితే జోరుగా జరుగుతోంది. తారక్‌ మామగారు వైసిపిలో చేరడం వల్ల ఎన్టీఆర్‌ కూడా వైసిపి మనిషే అన్న భావన కలిగించడానికి చాలా ట్రై చేస్తున్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తీసి పరోక్షంగా వైసిపికి మేలు చేయాలని చూసిన రాంగోపాల్‌వర్మ తనకి ఎలాంటి పక్షపాతం లేదని చెబుతూనే జగన్‌కి ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ఇస్తున్నాడు. తటస్థంగా వుండి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాననే భావన కలిగిస్తూ... తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు జూనియర్‌ ఎన్టీఆరేనని, లోకేష్‌కి అంత సీన్‌ లేదని వ్యాఖ్యానిస్తూ ఎన్టీఆర్‌ అభిమానులని టీడీపీకి దూరమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయనేది స్పష్టం కావడంతో పైచేయి కోసం ఇలాంటి ట్రిక్కులు భారీగానే వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English