క‌డ‌ప వెళ్లాల్సిన ప‌వ‌న్ అహోబిలానికి అందుకే వెళ్లారా?

క‌డ‌ప వెళ్లాల్సిన ప‌వ‌న్ అహోబిలానికి అందుకే వెళ్లారా?

అంతా ఓపెన్ గా ఉంటా. ఎలాంటి దాప‌రికాలు ఉండ‌వు. ప్రజ‌ల‌కు అన్ని విష‌యాలు చెబుతానంటూ  చెప్పే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకుంటారో ఒక ప‌ట్టాన అర్థం కాని ప‌వ‌న్ తాజాగా త‌న తీరుతో మ‌రోసారి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న షెడ్యూల్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న క‌డ‌ప‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. షెడ్యూల్ లో లేని అహోబిలానికి ప‌వ‌న్ బ‌య‌లుదేర‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. అహోబిలానికి ఆక‌స్మికంగా వెళ్లింది.. ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ కావ‌టానికే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత హ‌డావుడిగా.. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తో ప‌వ‌న్ భేటీ ఎందుకు అయిన‌ట్లు? అన్న క్వ‌శ్చ‌న్ కు స‌మాధానం దొర‌క‌టం లేదు. ఆయ‌న‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్‌.. గ‌వ‌ర్న‌ర్ తో ఏం మాట్లాడార‌న్న విష‌యం మీద ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. అయితే..  ఈ స‌మావేశంలో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేద‌ని.. కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిసిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌వేళ అదే నిజ‌మ‌నుకుంటే.. షెడ్యూల్ లో లేకుండా అహోబిలానికి ఎందుకు వ‌చ్చిన‌ట్లు?  ముందుగా అనుకున్న ప్ర‌కారం క‌డ‌ప‌కు వెళ్లాలి క‌దా?

అయినా.. గ‌వ‌ర్న‌ర్ సాబ్ ను క‌ల‌వాలంటే హైద‌రాబాద్ లో ఎప్పుడైనా క‌ల‌వొచ్చు?  కానీ.. అందుకు భిన్నంగా తాను ముందుగా అనుకున్న ప్రోగ్రాంను ప‌క్క‌న పెట్టి మ‌రీ అహోబిలానికి ఎందుకు వెళ్లిన‌ట్లు?  గ‌వ‌ర్న‌ర్ తో జ‌రిగిన భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కీల‌క‌మైన ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ.. ప‌వ‌న్ గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కావ‌టం హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English