పవన్ కళ్యాణ్‌ తెస్తారంటున్న రష్మి

పవన్ కళ్యాణ్‌ తెస్తారంటున్న రష్మి

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ పెద్దగా లేకపోయినా క్రేజ్ పరంగా పవన్ స్థాయి ఎప్పుడు తగ్గలేదు. అయితే రాజకీయాల్లో పవర్ స్టార్ ఫెట్ ఎలా ఉందనేది చెప్పడం కష్టమే. చాలా వరకు రాజకీయల్లో అనుభవజ్ఞులమని డబ్బా కొట్టుకునే వారు మాత్రం పవన్ కి ఒక్క సీటు కూడా రాదని స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తెస్తాడని సాదరణ ప్రజల నుంచి ఓ టాక్ వస్తోంది.

ఏం జరుగుతుంది అనేది ముందుగానే అంచనా వేయడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ. ఆ విషయం గురించి పక్కనపెడితే పవన్ కళ్యాణ్ జనాల మధ్యన తిరుగుతున్న తీరును చూసి సినీ స్టార్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా తనదైన శైలిలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పవన్ రాజకీయాలపై స్పందించారు. ప్రజలు రాజకీయాల్లో కోరుకుంటున్న మార్పును తప్పకుండా పవన్ కళ్యాణ్ తెస్తారని ఆశిస్తున్నట్లు రష్మీ వివరణ ఇచ్చారు.

డబ్బు మతం కులం సెంటిమెంట్ దారుల్లో కాకుండా ఆలోచించి ఓటు వెయ్యలని పవన్ ప్రతి స్పీచ్ లో చెబుతున్నాడు. ఇప్పుడే సీఎం అయిపోవాలని ఏమి లేదని చాలా సార్లు చెప్పిన పవన్, అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా అడుగులు వేస్తే చాలని మినిమం టార్గెట్ గా పెట్టుకున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది.. జనాల్లో మార్పు ఎంతవరకు వస్తుంది అనేది ఎలక్షన్ తరువాత గాని తెలియదు. అప్పుడే యాంకర్ రష్మి అంచనాలు కూడా ఏమవుతాయి అని అందరికీ తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English