33 మంది ఎన్నారై భ‌ర్త‌ల‌ పాస్‌పోర్టులు రద్దు

33 మంది ఎన్నారై భ‌ర్త‌ల‌ పాస్‌పోర్టులు రద్దు

ఏ త‌ల్లిదండ్రులైనా త‌మ కుమార్తెకు మంచి సంబంధం తేవాల‌నుకుంటారు. చ‌దువు - సంస్కారం - ఉద్య‌గోం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయిల వైపు ఎక్కువ‌గా మొగ్గుచూపుతుంటారు. మ‌న‌దేశంతో పోలిస్తే అక్క‌డ వేత‌నాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. త‌మ బిడ్డ కుటుంబం ఆర్థికంగా త్వ‌ర‌గా స్థిర‌ప‌డుతుంద‌ని ఆశిస్తారు.

కానీ - ఎన్నారై సంబంధాల విష‌యంలో త‌ల్లిదండ్రులు, అమ్మాయిలు మోస‌పోతున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి. పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకెళ్లి అక్క‌డ తీవ్ర చిత్ర హింస‌ల‌కు గురిచేయ‌డం - పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ అమ్మాయిని త‌న‌తోపాటు తీసుకెళ్ల‌క‌పోవ‌డం వంటి ఆరోప‌ణ‌ల‌పై కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. విదేశాల‌కు చెక్కేసిన భ‌ర్త తిరిగి రాక‌.. మ‌రో పెళ్లి చేసుకోలేక మ‌న‌దేశంలో ప‌లువురు అమ్మాయిలు తీవ్ర మ‌నో వేద‌న అనుభ‌విస్తున్నారు.

ఈ స‌మ‌స్య‌ల‌ను నివారించే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది. ఎన్నారై భ‌ర్త‌లు తోక జాడిస్తే వారిపై కొర‌డా ఝుళిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నారైలతో పెళ్లిళ్ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగానే భార్య‌ల‌ను వదిలి విదేశాలకు పారిపోయిన 33 మంది ప్ర‌వాస భార‌తీయుల పాస్ పోర్టుల‌ను కేంద్రప్ర‌భుత్వం తాజాగా ర‌ద్దు చేసింది. వారిలో 8 మందిపై ఇంటర్ పోల్‌ ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఎన్నారైల వివాహాలను వారంలోపే నమోదు చేయించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివ‌ర్గ ఆమోదం కోసం పంపించిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి పాస్‌పోర్టు రద్దు చేసే నిబంధనను కూడా తీసుకొచ్చే ప్రతిపాదన ఉందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English