ప‌వ‌న్ చెప్పిన ల‌డ్డూల క‌థ‌

 ప‌వ‌న్ చెప్పిన ల‌డ్డూల క‌థ‌

చంద్ర‌బాబును తిట్ట‌డం ద్వారా నేష‌న‌ల్ లీడ‌ర్ అవ్వాల‌ని భావిస్తున్నాడో ఏమో తాను ఎక్క‌డ ప‌ర్య‌టించినా, ఎక్క‌డ మాట్లాడినా, ఎక్క‌డ ప్రెస్ మీట్ పెట్టినా... చంద్ర‌బాబును నాలుగు మాట‌లు అన‌క‌పోతే ఆయ‌న ప్రారంభించ‌డు, ముగించ‌డు.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ విచిత్ర‌మైన వ్యాఖ్య చేశారు.
"చంద్రబాబు అబద్ధాలు చూస్తుంటే సముద్రం ఇంకిపోతుందేమో అనిపిస్తోందని" కాకినాడలోని కల్పన సెంటర్లో నిర్వహించిన ఓ సభలో పవన్ వ్యాఖ్యానించారు. కానీ ఆ అబ‌ద్ధాలేవో మాత్రం వివ‌రించ‌లేదు. అదేదో తెలంగాణ సామెత బ‌ట్ట కాల్చి మొహం మీద వేసిన‌ట్లే ఉంది ప‌వ‌న్ వ్య‌వ‌హారం.

ఆయ‌న ఇంకో పోలిక కూడా చెప్పారండో...  బీజేపీ పాచిపోయిన లడ్డూ. టీడీపీ, కాంగ్రెస్‌లు తినడానికి పనికిరాని లడ్డూలట‌.. వైసీపీ లడ్డూ వాళ్లకు మాత్రమే పనికివచ్చే లడ్డూ అట‌. పోన్లే త‌న ఫ్రెండ్ ల‌డ్డూ చెడిపోలేదు. భ‌విష్య‌త్తులో పొత్తు కుదిరితే ఆ ల‌డ్డూ షేర్ చేసుకోవాలి క‌దా. లేక‌పోతే బాలేద‌న్నావు ఎలా తింటున్నావు అని అడుగుతారుగా జ‌నం. కానీ జ‌న‌సేన ఏ టైపు ల‌డ్డూ అనేది మాత్రం ప‌వ‌న్ చెప్ప‌లేదు.

ఇక ప‌వ‌న్‌ సారు అమ‌రావ‌తి వ‌ద్ద‌ని నోరు జారేశారు. హైద‌రాబాదులాగే చంద్ర‌బాబు అభివృద్ధి అంతా అమ‌రావ‌తిలో చేస్తున్నాడు. ఇది జిల్లాల మ‌ధ్య కొట్లాట‌ల‌కు దారితీస్తుంది అని వ్యాఖ్యానించారు. ఒక‌వైపు జ‌గ‌నేమో అక్క‌డ అమ‌రావ‌తే లేదంటాడు. ఈయ‌నేమో అమ‌రావ‌తిలోనే అంతా కేంద్రీకృతం అవుతందంటారు. వీళ్ల లెక్క‌న చూసుకుంటే ఎవ‌రిదో ఒక‌రిది నిజ‌మై ఉండాలి. మ‌రి అబ‌ద్ధం చెప్పిందెవ‌రో.  ప‌వ‌నా? జ‌గ‌నా?

ఇదిలా ఉంటే.. అస‌లు ప‌వ‌న్ ఏపీ వార్త‌లు చ‌దువుతున్నాడా లేదా అనే అనుమానం వ‌స్తుంది? కియా కంపెనీ అమ‌రావ‌తిలో పెట్ట‌లేదు. షియామి అమ‌రావ‌తిలో పెట్ట‌లేదు. హీరో కంపెనీ అమ‌రావ‌తిలో పెట్ట‌లేదు. బెల్ కంపెనీ అమ‌రావ‌తిలో పెట్ట‌లేదు. ఐటీ కంపెనీలు అమ‌రావ‌తిలో పెట్ట‌లేదు. కృష్ణ‌ప‌ట్నం పోర్టు అమ‌రావ‌తిలో లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు అమ‌రావ‌తిలో లేదు. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ హ‌బ్ ప్లాన్ అమ‌రావ‌తిలో కాదు... పోనీ ఇవ‌న్నీ ఎక్కడున్నాయో ప‌వ‌న్‌కు తెలుసో లేదో మ‌రి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English