సెటిలర్లు కారు ఎక్కరా...!

సెటిలర్లు కారు ఎక్కరా...!

సెటిలర్లు....వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యాగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం వివిధ వ్రుత్తులలో పనిచేసుకునేందుకు హైదారాబాద్ మహానగరానికి వచ్చనవాళ్లు.. వీరికి తెలంగాణ సంస్క్రుతి సాంప్రదాయాలు, పండుగలు తమవే అయ్యాయి.

ఈ సెటిలర్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన వారు లక్షలలో ఉన్నారు. శాసనసభ అయిన లోక్‌సభ అయిన, నగర పాలక సంస్థలైన, పంచాయితీలైన చివరికి వార్డులలోనైన ఎన్నికలు జరిగితే సెటిలర్ల ఓట్లే కీలకం. దీనిని ద్రుష్టిలో పెట్టుకునే అన్నీ రాజకీయ పార్టీలు సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అయితే కడుపులో పెట్టుకుంటాం, ఇంట్లో దాచుకుంటాం వంటి ప్రకటనలు చేసారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెటిలర్లు అన్న మాటే లేదన్నారు. అయితే గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి, చంద్రశేఖర రావు ఎన్నికల సభలలో ప్రసంగాలు సెటిలర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటున్నారు.

సమైక్య రా‌ష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనాధగా మిగిలింది. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ మాట మార్చింది. దీంతో తెలంగాణలో ఉన్న  ఆంధ్ర సెటిలర్లు బిజేపీపై గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీతో అంటకాగుతున్నారన్న వార్తలతో కేసీఆర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు ప్రత్యేక హోదాకు తామూ వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ప్రకటించడం కూడా ఆంధ్ర సెటిలర్లకు మింగుడు పడడం లేదు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ వైపు ఉన్న ఆంధ్ర సెటిలర్లు ప్రత్యేక హోదా అంశంతో కారుకు దూరమవుతున్నట్లు సమాచారం.

ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిజామాబాద్, నల్గొండ, వనపర్తి సభలలో ప్రసంగించిన తీరు సెటిలర్లపై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. ఈ సభలలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నానమాటలు అంటున్నారు.
రాయడానికి వీలు కూడా లేని పరుష పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రసంగాలు ఒక్క చంద్రబాబు నాయుడికి సంబంధించినవే కాదని, ఆంధ్రులైన తమకూ వర్తిస్తాయని సెటిలర్లు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు తామూ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వైపు సానుభూతి చూపిస్తున్నాంటున్నారు.

పైగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలుస్తుండడంతో ఆంధ్ర సెటిలర్లు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో అధికార మార్పిడి జరిగితేన ఇక్కడ తమకూ, ఆంధ్రప్రదేశ్‌లో తమ వారికి మేలు జరుగుతుందనే భావన ఆంధ్ర సెటిలర్లలో రోజురోజుకు పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మహాకూటమిలో పొత్తులు ఖరారై అభ్యర్దులను ప్రకటిస్తే కేసీఆర్ మరింత రెచ్చిపోతారని, ఇది రాజకీయంగా ఆయనకే నష్టం అని రాజకీయ పండితుల విశ్లేషణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English