ప్ర‌ణ‌య్ తండ్రి ఏమి కోరుతున్నారు

ప్ర‌ణ‌య్ తండ్రి ఏమి కోరుతున్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఉదంతంపై  హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి వేస్తున్న ప్ర‌శ్న ఇప్పుడు కొత్త సందేహాల‌కు తావిస్తోంది. హంత‌కులు ప‌ట్టుబ‌డిన‌ట్లుగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్ట‌టం.. కేసుకు సంబంధించిన అన్ని వివ‌రాల్ని చెప్పేసిన‌ట్లుగా పోలీసులు క‌నిపించిన‌ప్ప‌టికీ కీల‌క‌మైన ఒక అంశాన్ని పోలీసులు ప్ర‌స్తావించ‌లేదంటున్నారు.

అదే విష‌యాన్ని ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి లేవ‌నెత్త‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసిన‌ట్లుగా చెబుతున్న బిహార్ కు చెందిన హంత‌కుడు శ‌ర్మ వేలిముద్ర‌లు.. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసిన‌ప్పుడు వినియోగించిన క‌త్తి మీద ఉన్న వేలిముద్ర‌లు ఒకటేనా? అన్న విష‌యాన్ని ఎస్పీ ప్ర‌స్తావించ‌లేద‌ని ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి ప్ర‌శ్నిస్తున్నారు. వేలిముద్ర‌లు కానీ ఒక‌టి కాకుంటే.. కేసు వీడిపోతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

వేలిముద్ర‌లు ధ్రువీక‌ర‌ణ కాకుంటే హంత‌కుడు త‌ప్పించుకునే వీలుంద‌ని..అదే స‌మ‌యంలో హత్య‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి డ‌బ్బున్న వ్య‌క్తి కావ‌టంతో కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. హంత‌కుడు చేసిన ప‌నికి ఉరిశిక్ష ప‌డితే తాము సంతోషిస్తామ‌ని.. మారుతీరావు లాంటోళ్లు మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇలానే హ‌త్యలు చేసే అవ‌కాశం ఉంద‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేశారు.

మారుతీరావుకు.. శ‌ర్మ‌ల‌కు ఉరిశిక్ష ప‌డేలా ప్ర‌జాసంఘాలు.. పార్టీలు.. పోలీసులు ప్ర‌య‌త్నం చేయ‌వాల‌ని.. ప్ర‌ణ‌య్ ను చంపినోళ్లు.. రేపు త‌మ‌ను చంప‌ర‌న్న గ్యారెంటీ ఏమిట‌ని?  ప్ర‌శ్నించారు. ఇలాంటి హంత‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే అమ్మాయి అమృత‌ను కిడ్నాప్ చేసి త‌మ నుంచి దూరం చేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అందుకే నిందితుల‌పై త‌క్ష‌ణ‌మే పీడీ యాక్ట్ పెట్టాల‌ని డిమాండ్ చేశారు. నిజ‌మే.. బాల‌స్వామి సందేహంలో పాయింట్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English