ఇందిర త‌ర‌హాలోనే మోదీపై వ్య‌తిరేక‌త‌!

ఇందిర త‌ర‌హాలోనే మోదీపై వ్య‌తిరేక‌త‌!

2019ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న త‌రుణంలో భార‌త రాజ‌కీయాలు క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతున్నాయి. ప్ర‌ధాని మోదీ, బీజేపీల పై దేశ ప్ర‌జ‌లలో ఉన్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. మోదీ ఏకచ్ఛ‌త్రాధిప‌త్యాన్ని ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ తో క‌లిసి మ‌హాకూట‌మి ఏర్పాటు చేసేందుకు పావులు క‌దుపుతున్నాయి. ఇప్ప‌టికే మ‌మ‌త‌, సోనియాలు ఇదే విష‌యంపై విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వ‌గా...తాజాగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ శరద్‌ పవార్ వారికి జ‌త క‌లిశారు.  బీజేపీపై  శ‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని ఓడించేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌టి కావాల‌ని అన్నారు.

ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యం లేని ప్రతిపక్ష నేతలంతా ఏకం కావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. 1975-77 కాలం నాటి పరిస్థితులు ఇపుడున్నాయ‌ని.. నాడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ఉన్న వ్యతిరేకత త‌ర‌హాలోనే నేడు మోదీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని చెప్పారు. దానిని క్యాష్ చేసుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ఏకం కావాల‌న్నారు. సోనియా గాంధీ, దేవె గౌడ, తాను క‌లిసి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. జాతీయ స్థాయి పొత్తులకు బదులుగా రాష్ట్ర స్థాయిలో పొత్తులపై దృష్టి పెట్టాలని పవార్ సూచించారు. మ‌రోవైపు, విపక్ష ప్రధాని అభ్యర్థిగా మ‌మతా బెనర్జీ ఉండ‌డం వ‌ల్ల త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని దేవెగౌడ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే, శ‌రద్ ప‌వార్ అన్న‌ట్లు నిజంగా 1975-77 నాటి ప‌రిస్థితులు ప్ర‌స్తుతం దేశంలో ఉన్నాయా....అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక మాన‌దు. వాస్త‌వానికి 1975-77 స‌మయంలో ఇందిరా గాంధీ ప్ర‌జా సంక్షేమం కోసం కొన్ని మంచి కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు చేప‌ట్టారు. పాక్ కు దీటుగా స‌మాధాన‌మిస్తూ ...దాయాది దేశ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేశారు. పార్ల‌మెంటులో మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి వంటి రాజ‌కీయ కురువృద్ధుడే....ఇందిర‌ను పొగిడారంటే ఆమె ప‌రిపాల‌నా ద‌క్ష‌త ఏమిటో అర్థ‌మ‌వుతోంది. అయితే, ఆమెకు తెలియ‌కుండానే....ఆమె ప్ర‌జ‌ల‌కపై ఓ ర‌క‌మైన నియంతృత్వ ధోర‌ణిని అవ‌లంబించ‌డం ప్రారంభించారు. దీంతో, ఆమెపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. కానీ, తాను మంచి ప‌నులు చేసినా....వ్య‌తిరేక‌త ఎందుకుంటుంది .అని ఓవ‌ర్ లుక్ లో ఇందిర ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇందిర ఇగో హ‌ర్ట్ అవ‌డం....దీంతో ప్ర‌జ‌ల‌పై ఆమె కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ప్రారంభించారు.  ఆ క్ర‌మంలో వ్య‌తిరేక‌త మ‌రింత ఎక్కువై ఇందిర గ‌ద్దె దిగే ప‌రిస్థితి వ‌చ్చింది.

స‌రిగ్గా అదే త‌ర‌హాలో ఇప్పుడు మోదీ వెళుతున్నార‌న్న‌ది శ‌ర‌ద్ ప‌వార్ తో పాటు రాజ‌కీయ విశ్లేష‌కుల అంచనా. ఇందిర లాగానే మోదీ కూడా సుప‌రిపాల‌న అందిస్తున్నార‌ని భ్ర‌మ‌ప‌డుతున్నారు. మోదీ దృష్టిలో ఆయ‌న భార‌త్ ను ముందుకు తీసుకువెళుతున్నారు. సుప‌రిపాల‌న అందిస్తున్నారు. గ్రామీణ భార‌తాన్ని కూడా డిజిట‌ల్ మ‌యం చేయాల‌ని సంక‌ల్పించారు. అయితే, నాణేనికి మ‌రోవైపును మోదీ చూడ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. పెద్ద నోట్ల‌ ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల ....ఆర్థిక వ్య‌వస్థ అత‌లాకుతల‌మ‌యింది....ఏటీఎంలను అంద‌రు ప్ర‌జ‌లు వాడ‌లేని భార‌త్ ను డిజిట‌లైష‌న్ పేరుతో మోదీ మ‌రింత అగాథంలోకి నెట్టారు. ఇక జీఎస్టీ పేరుతో అడ్డ‌గోలుగా ప‌న్నుబాదుకు కార్య‌క్ర‌మంతో సామాన్యుల న‌డ్డివిరిచారు. బ్లాక్ మ‌నీ...భార‌త్ కు రాలేదు ....నోట్ల ర‌ద్దు వ‌ల్ల స్వ‌దేశంలో న‌ల్ల‌ధ‌నం క‌ట్ట‌డి కాలేదు.

ఇవ‌న్నీ చూడ‌లేని మోదీ....మ‌రోలా ఆలోచిస్తున్నారు. ప్ర‌జ‌లకోసం ఇంత చేశాను క‌దా.....అవినీతికి పాల్ప‌డ‌లేదు...ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌లేదు. అయినా త‌న‌పై ప్ర‌జ‌లకు వ్య‌త‌రికేత ఏంటి అన్న గంత‌ల‌ను మోదీ క‌ళ్ల‌కు క‌ట్టుకున్నారు. గ‌తంలో ఇందిర ఇగో హ‌ర్ట్ అయిన‌ట్లుగానే....మోదీకి కూడి ఇగో హ‌ర్ట్ అయింది. మోదీ అహంకార పూరిత ధోర‌ణి......పార్టీ నేత‌ల ప‌ట్ల మోదీ వ్య‌వ‌హార శైలి...కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ప‌ట్ల మోదీ తీరు....ఇవ‌న్నీ ఆ వ్యతిరేక‌త‌ను పెంచాయి. అద్వానీ వంటి కురు వృద్ధుడిని మోదీ అవ‌మానించిన తీరును ప్ర‌తిప‌క్షాల‌తో పాటు స్వ‌ప‌క్షం కూడా దుయ్య‌బ‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ , జేడీఎస్ గెలిచినందుకు అస‌లు ఏ పార్టీకి సంబంధం లేని వారు కూడా సంబ‌రాలు చేసుకున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌కీయాల‌పై క‌నీస అవ‌గాహ‌న లేని వారు కూడా మోదీపై గుర్రుగా ఉన్నారంటే ఆ వ్య‌తిరేక‌త శాతం ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు. ఏతా వాతా శ‌ర‌త్ ప‌వార్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English