ఎర్రబెల్లి 'ఓపెన్‌' అయిపోయారు

ఎర్రబెల్లి 'ఓపెన్‌' అయిపోయారు

టిడిపి సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ విషయంలో టిడిపి వైఖరి పట్ల 'ఓపెన్‌' అయిపోయారు. తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్‌గా పనిచేస్తున్నారు ఎర్రబెల్లి. తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉందని ఇప్పటిదాకా చెప్పిన ఎర్రబెల్లి, తెలంగాణపై టిడిపి ఇచ్చిన లేఖలో స్పష్టత లేదని తేల్చారు.

ఆ లేఖపై ఎర్రబెల్లి తొలుత అసహనం వ్యక్తం చేస్తూ, చంద్రబాబుని నిలదీశార్ట కూడాను. కాని అప్పుడు కడియం శ్రీహరి తనను బుజ్జగించారని ఎర్రబెల్లి చెప్పారు. తనను బుజ్జగించిన కడియం శ్రీహరి టిఆర్‌ఎస్‌లోకి ఎలా వెళ్తారు? అన్నది ఎర్రబెల్లి ప్రశ్న అనుకోవాలా? లేకుంటే, తనకూ టిడిపి లేఖ నచ్చలేదని ఎర్రబెల్లి చెప్పదలచుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే, ఎర్రబెల్లిలో అసహనం బయటపడుతుంది.

ఎర్రబెల్లి తమతో టచ్‌లో ఉన్నారని టిఆర్‌ఎస్‌ నేతలు చెప్పగా, కడియం శ్రీహరి ఈలోగా పార్టీ మార్చేశారు. కడియం వెళ్ళారు కాబట్టి, ఎర్రబెల్లి తగ్గారని చెప్పుకుంటున్నారు రాజకీయ వర్గాలలో కొందరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English