ఇంకెందుకు.. లాహోర్‌లో జెండా ఎగ‌రేయండి

ఇంకెందుకు.. లాహోర్‌లో జెండా ఎగ‌రేయండి

భార‌త్‌లో త‌ర‌చూ చొర‌బాట్ల‌కు తెర తీస్తూ దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించే పాక్ కు దిమ్మ తిరిగేలా తాజాగా దెబ్బ కొట్టింది భార‌త సైన్యం. నియంత్ర‌ణ రేఖ వెంట.. పాక్ ఏర్పాటు చేసిన శిబిరాల‌పై మెరుపుదాడి చేసిన భార‌త సైన్యం తీరును దేశంలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ అభినందిస్తున్నాయి.

మొన్నీ మ‌ధ్య వ‌ర‌కూ బీజేపీ అంటేనే విమ‌ర్శ‌లు కురిపిస్తున్న శివ‌సేన సైతం.. తాజా చ‌ర్య‌ను విప‌రీతంగా పొగిడేసింది. ఇక ఇప్పుడు ఆగే స‌మ‌యం లేద‌ని.. లాహోర్ కి వెళ్లి మ‌రీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగురవేయాల‌న్నారు శివ‌సేన పార్టీ ప్ర‌తినిధి అర‌వింద్ సావంత్‌. పాకిస్థాన్‌ను అక్ర‌మించుకోవాల‌న్న రీతిలోఆయ‌న వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. కాంగ్రెస్ పార్టీ సైతం తాజా దాడుల్ని స‌మ‌ర్థించింది. సైన్యం చ‌ర్య‌ను ఆ పార్టీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. నియంత్ర‌ణ రేఖ వెంట ఉన్న పాక్ శిబిరాల‌ను నాశ‌నం చేయ‌టంలో భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన అస‌మాన ధైర్య సాహ‌సాల్ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి సుర్జేవాలా అభినందించారు.

ఈ శిబిరాల ఆస‌రాతో చొర‌బాటుదారులు భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తున్నార‌న్నారు. మిగిలిన పార్టీలు సైతం సైన్యం తీరును అభినందించాయి. ఇదిలా ఉంటే.. మే 9 త‌ర్వాత 20.. 21 నెల‌ల్లో నిర్వ‌హించిన దాడుల్లో రాకెట్ లాంచ‌ర్లు..  యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు.. ఆటోమేటెడ్ గ్ర‌నేడ్ లాంచ‌ర్లు.. రికోయిలెస్ గ‌న్ లు ఉప‌యోగించిన‌ట్లుగా భార‌త్ సైన్యం వెల్ల‌డించింది. చొర‌బాట్ల‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్ని టార్గెట్ చేసి మ‌రీ ధ్వంసం చేసిన‌ట్లుగా ఆర్మీ ప్ర‌తినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ న‌రులా వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. సైన్యం జ‌రిపిన దాడులపై పాకిస్థాన్ లో విచిత్ర‌మైన స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లుగా కొన్ని మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నాయి. భార‌త సైన్యం దాడుల్ని పాక్ ప్ర‌భుత్వం ఖండిస్తోంది. త‌మ శిబిరాల‌పై భార‌త్ దాడులే చేయ‌లేద‌ని పాక్ ఆర్మీ కొట్టి పారేస్తున్న క‌థ‌నాన్ని డాన్ ప‌త్రిక ప్ర‌చురించ‌గా.. దానికి స్పందించిన ప‌లువురు పాక్ ప‌ర‌జ‌లు భార‌త ఆర్మీ మంచి ప‌ని చేసిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా భార‌త ప్ర‌ధాని మోడీ ది గ్రేట్ అంటూ పొగిడేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు