కేసీఆర్ ఫ్యామిలీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ఫ్యామిలీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సీపీఐ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ తరలింపునకు వ్యతిరేకంగా సేవ్ ధర్నా చౌక్ పేరిన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల తరువాత కేటీఆర్ కాదు, కేసీఆర్ మనవడు సీఎం అయ్యేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు.

అధికారిక కార్యక్రమాల్లో సైతం కేసీఆర్ మనవడు కనిపిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పదేళ్ల తర్వాత కేటీఆర్ కాదు... ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
  
కాగా ఇటీవల భద్రాచలం రాముల వారికి హిమాన్ష్ వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇప్పటికే చర్చకు దారి తీసింది. ప్రతీ ఏటా ముఖ్యమంత్రే స్వామివారికి  పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ వచ్చింది దీనికి తోడు సిఎం మనవడు పట్టు వస్త్రాలు సమర్పించడం కొంత వివాదమైంది. హిమాన్ష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎలా అవుతారని పలు పార్టీల నేతలు ప్రశ్నించారు.
  
అయితే... టీఆర్ఎస్‌ నేతలు ఆ వాదనను అప్పుడు తప్పు పట్టారు. హిమాన్ష్ కేవలం కేసీఆర్ కుటుంబం తరపున పట్టువస్త్రాలు సమర్పించారని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. అయితే.. తరచూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కేసీఆర్ తో పాటు హిమాన్ష్ కనిపిస్తుండడంతో వివాదమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు