దిగితే దంచేవాడినంటున్న ఒబామా

దిగితే దంచేవాడినంటున్న ఒబామా

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. ట్రంప్ అధ్యక్షుడిగా లాంఛన ప్రాయపు ఎంపిక కూడా ముగిసింది. ఇక కేవలం ట్రంప్ ప్రమాణస్వీకారమే మిగిలింది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ జపం ఎక్కువైంది. చివరకు వైట్ హౌస్ అధికారులు కూడా కొన్ని విషయాల్లో ట్రంప్ ను సంప్రదిస్తున్నట్లు టాక్.

ఇలాంటి సమయంలో ఒబామా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హీటు పుట్టిస్తున్నాయి. తాను బరిలోకి దిగి ఉంటే ట్రంప్ ను ఓడించి ఉండేవాడినని ధీమా వ్యక్తం చేశారు ఒబామా. హిల్లరీ ప్రచారంలో కూడా లోపం లేదని, అయితే కాలం కలిసిరాలేదంటున్నారు ఒబామా.

మరోవైపు ఒబామా కామెంట్స్ పై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. ఒబామాకు అంత సీన్ లేదని, పగటి కలలు కంటున్నారనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఒబామా కేర్, ఐఎస్ఐఎస్ , ఉద్యోగాల సంక్షోభంతో ఆయనెలా గెలుస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు ట్రంప్.

మొన్నటిదాకా బాగానే ఉన్న ఒబామా, ట్రంప్.. ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మన దేశంలో మాదిరిగా బజార్న పడి తిట్టుకోపోయినా.. అమెరికాలో ఈ మాత్రం కామెంట్స్ ను కూడా సీరియస్ గానే తీసుకుంటారు. మొత్తం మీద హిల్లరీని ఓడించాడన్న కసి ట్రంప్ మీద ఒబామాకు బాగా ఉన్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు