ఏటీఎంలుగా పెట్రోల్ బంకులు

ఏటీఎంలుగా పెట్రోల్ బంకులు

మీరు విన్నది నిజమే. నిన్న వరకూ డబ్బులు కావాలంటే ఏటీఎంల వద్దకే వెళ్లాల్సి ఉండేది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల వద్ద భారీ క్యూలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటిదాకా ఏటీఎంల దగ్గర క్యూ కట్టిన ప్రజలు.. ఇకపై పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరే పరిస్థితి కనిపించనుంది.

బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండి చేతిలో డెబిట్ కార్డులు ఉంటే చాలు.. ఈ రోజు (శుక్రవారం) నుంచి ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకులు ఏటీఎం సెంటర్లుగా  మారనున్నాయి. పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులు స్వైప్ చేసి రోజుకు రూ.2వేల వరకూ తీసుకునే వెసులుబాటు ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎంపిక చేసిన 2500  పెట్రోల్ బంకుల్లో తాజా సౌకర్యం అందుబాటులో ఉండనుంది.

పెద్ద నోట్లనురద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు నోట్ల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసినా గంటలకే ఖాళీ అయిపోవటం.. ఎంతకూ తరగని క్యూ లైన్ల నేపథ్యంలో.. రద్దీ తగ్గించే పనిలో భాగంగా.. ఎస్ బీఐ స్వైపింగ్ మెషిన్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయం ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది.  తాజా నిర్ణయంతో పెట్రోల్ బంకుల్లో కూడా క్యూ బార్లు మొదలు కానున్నాయన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు