ప్రణీత స్టార్ తిరిగింది!

ప్రణీత స్టార్ తిరిగింది!

ఏం పిల్లో ఏం పిల్లడో లాంటి చిన్న సినిమాతో సినిమా రంగంలో అడుగుపెట్టింది ప్రణీత. అందరికీ బాగానే నచ్చడంతో తర్వాత కొన్ని అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే అవన్నీ ఫెయిలవడంతో కెరీర్ డల్ అయ్యింది. అలాగని పూర్తిగా పట్టించుకోని పరిస్థితి కూడా కాదు. అప్పుడప్పుడూ ఒక్కో చాన్స్ దొరకుతూనే ఉంది. అయితే ఆమె ఊహించని విధంగా ఏకంగా పవన్ కళ్యాణ్ తో నటించే చాన్స్ వచ్చింది.

అత్తారింటికి దారేది చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది ప్రణీత. ఆ సినిమాలో నటించమని త్రివిక్రమ్ అడిగితే, తన చెవులను తానే నమ్మలేకపోయిందట అమ్మడు. మెగా హీరోతోటి, అది కూడా పవన్ కళ్యాణ్ తోటి చేయడమంటే మాటలా! ఎగిరి గంతేసిందట. అదే ఓ రేంజ్ షాక్ అంటే, ఆమెకు ఇంకో పెద్ద సర్ ప్రయిజ్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది.

ఒక్క మెగా హీరోతో చేయడమే లక్ అంటే, మరో మెగా హీరోతో చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చేసరికి సంతోషంతో తుళ్లిపడుతోంది అమ్మడు. ఇక తనకు తిరుగులేదని మురిసిపోతోంది. అవకాశాలు లేకే అప్పుడెప్పుడో లోదుస్తులు కూడా వేసుకోకుండా ఓ ఫంక్షన్ కి వచ్చి, అందరి మతులూ పోగొట్టాలని ప్రయత్నించింది. ఇప్పుడు స్టార్ తిరిగిందిగా... ఇక అలాంటి తిక్క వేషాలు వేయదేమోలెండి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు