అల్లు బాబు పాట్లు

అల్లు బాబు పాట్లు

ఈమధ్య తెరపైకి వచ్చిన మెగా హీరోల్లో అల్లు శిరీష్‌ ఒక్కడే ఇంకా ఇంప్రెస్‌ చేయలేకపోయాడు. కొత్తజంట ఏదో ఒక మాదిరిగా అయితే ఆడేసింది కానీ శిరీష్‌కి హీరోగా ఎలాంటి ఐడెంటిటీ తీసుకురాలేదు. మెగా హీరోలు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఇంప్రెస్‌ చేస్తూ ఫ్యూచర్‌ స్టార్స్‌ అనిపించేసుకుంటూ ఉంటే... అల్లు శిరీష్‌ ఒక్కడే అవుటాఫ్‌ ప్లేస్‌ అనిపిస్తున్నాడు. తన టాలెంట్‌ ఏంటో కూడా చూపించాలని శిరీష్‌ తహతహలాడుతున్నాడు. తన తదుపరి చిత్రంతో విమర్శకులకి గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. ఇందుకోసం అల్లు శిరీష్‌ గట్టిగా కష్టపడుతున్నాడు.

తన నెక్స్‌ట్‌ మూవీలో అతను సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. సోలో ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ నటించే చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లనుంది. ఇంతవరకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ట్రై చేయని శిరీష్‌ ఈసారి మాస్‌ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన హీరోల మాటెలా ఉన్నా ముందు ఆల్రెడీ నమ్మకం కలిగించిన మెగా హీరోల మధ్య షైన్‌ అవ్వాలంటే శిరీష్‌కి పెద్ద పరీక్షే అవుతుంది. మరి దీంట్లో అతనెలా నెగ్గుకొస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు