మహేష్‌ని అక్కడా కొట్టేసిన చరణ్‌

మహేష్‌ని అక్కడా కొట్టేసిన చరణ్‌

    1 నేనొక్కడినే థియేటర్లలో ఫ్లాప్‌ అయినా టీవీలో అయినా హిట్టనిపించుకుంటుందని, ఆ సినిమాకి ఉన్న గొప్పతనాన్ని ఆలస్యంగా అయినా జనం గుర్తిస్తారని అభిమానులు ఆశించారు. ఖలేజా చిత్రం టీవీలో గ్రాండ్‌ హిట్‌ అయినట్టుగా 1 నేనొక్కడినే కూడా ఆదరణ పొందుతుందని అనుకున్నారు. థియేటర్లలో ఎక్కువమంది చూడలేదు కాబట్టి టీవీలో ఫస్ట్‌ టైమ్‌ వచ్చినపుడు టీఆర్పీలు అదిరిపోతాయని అనుకున్నారు.

కానీ ఈ చిత్రం ప్రసారమైనప్పుడు మళ్లీ దీనికి పోటీగా ఎవడు చిత్రాన్ని వేరే ఛానల్‌లో వేసారు. అదే రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా జరగడంతో 1 నేనొక్కడినే టీవీలో కూడా ఫ్లాపయింది. ఎవడు చ్తిత్రానికి 10.14 టీఆర్పీ రేటింగ్స్‌ వస్తే 1కి కేవలం 7.32 రేటింగ్స్‌ వచ్చాయి. దీంతో మరోసారి మహేష్‌పై చరణ్‌దే పైచేయి అయినట్టయింది. కల్ట్‌ సినిమా అని ఫాన్స్‌ సంతృప్తి పడుతోన్న ఈ చిత్రం నచ్చిన వాళ్లు బాగా తక్కువ ఉన్నారని మళ్లీ రుజువైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు