అనుష్క అతి కొంప ముంచింది

అనుష్క అతి కొంప ముంచింది

    ఒకేసారి ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడం వల్ల హీరోయిన్లు నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇంతకాలం చాలా డిస్లిప్లిన్డ్‌ యాక్ట్రెస్‌గా పేరున్న అనుష్క ఇప్పుడు మరీ ఎక్కువ సినిమాలు ఒకేసారి టేకప్‌ చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. బాహుబలి, రుద్రమదేవి వంటి హెవీ డ్యూటీ సినిమాల మధ్య అనుష్క మరో సినిమా అంగీకరించడం తప్పే. అది కూడా టైట్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకుని వేగంగా పూర్తి చేద్దామని చూస్తున్న అజిత్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాకి అనుష్క డేట్స్‌ ఇచ్చింది.

అనుకున్నట్టుగానే ఈ చిత్రం షూటింగ్‌కి అనుష్క అడ్డమవుతోంది. రెండు రోజుల పాటు అనుష్క వల్ల ఈ చిత్రం షెడ్యూల్‌ దెబ్బ తినడంతో గౌతమ్‌ మీనన్‌ అసహనం వ్యక్తం చేసాడట. బాహుబలి, రుద్రమదేవి సినిమాల షూటింగ్స్‌ కరెక్ట్‌ ప్లానింగ్‌ ప్రకారం జరగడం అసాధ్యం కనుక అనుష్క ఈ చిత్రం కోసం వెంపర్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు అనవసరంగా ఇంతకాలం తనకున్న మంచి పేరుని ఆమె చెడగొట్టుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు